నకిలీ నోట్ల చలామణి ముఠా అరెస్టు
Published Tue, Sep 3 2013 4:37 AM | Last Updated on Sat, Sep 22 2018 7:51 PM
జ్యోతినగర్, న్యూస్‌లైన్:నకిలీ నోట్లను ముద్రించి చలామణి చేస్తున్న ఓ ముఠాను ఎన్టీపీసీ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, రామగుండం సీఐ రాజేంద్రప్రసాద్, ఎన్టీపీసీ ఎస్సై బి.ఉపేందర్ నిందితుల వివరాలు వెల్లడించారు. గొల్లపల్లి సత్యనారాయణాచారి (మార్కండేయ కాలనీ, గోదావరిఖని), ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్‌లో 2008లో మోటార్ చోరీ కేసులోఅరెస్టయ్యాడు. జిల్లా కారాగారంలో దొంగనోట్ల కేసులో నిందితుడిగా ఉన్న కొత్తపల్లి శంకర్ తో అతడికి పరిచయం ఏర్పడింది. అక్కడ నకిలీ నోట్ల తయారీ విధానాన్ని తెలుసుకున్నాడు. అనంతరం బెయిల్‌పై విడదలయ్యాడు. గోదావరిఖని చంద్రబాబు కాలనీలో నివసిస్తూ అదే కాలనీలో కిరాణ వ్యాపారం చేసుకుంటున్న తాటిపల్లి సత్యనారాయణతో స్నేహం చేశాడు.
సులువుగా డబ్బు సంపాదించాలని ఆలోచించిన ఈఇద్దరు దొంగనోట్లను తయారు చేసి మార్కెట్‌లో చలామణి చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఓ ప్రింటర్‌ను కొనుగోలు చేశారు. రూ.500 నోటును స్కాన్ చేసి 34 ప్రింట్లు తీశారు. వాటిని ఆదివారం ఎన్టీపీసీ ప్రాంతంలో సంతలో చలామణి చేసేం దుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకుని విచారించారు. విచారణ అనంతరం గొల్లపల్లి సత్యనారాయణాచారి, తాటిపల్లి సత్యనారాయణను అరెస్టు చేసి వారి దగ్గరున్న ప్రింటర్, నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నకీలీ నోట్ల ముఠాను పట్టుకున్న ఏఎస్సై రాజేశం, కానిస్టేబుల్ దుబాసి రమేష్, హోంగార్డు మీస శ్రీనివాస్‌లను డీఎస్పీ ఉదయ్‌కుమార్ రెడ్డి అభినందించారు.
Advertisement
Advertisement