‘ఫర్జీ’ వెబ్ సిరీస్ చూసి ₹2000 దొంగనోట్లను ముద్రించిన ఇద్దరు కేటుగాళ్లను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 40 ఏళ్ల వయసు పైబడిన నిందితులు తాజిమ్, ఇర్షాద్‌లు ఈ దొంగనోట్లను చలామణీ చేస్తుండగా పోలీసులకు చిక్కారు. ఆ సమయంలో నిందితులిద్దరూ ₹2000 దొంగనోట్లను దాచివుంచి, వాటిని తక్కువ మొత్తానికి మారుస్తున్నారు. పోలీసులు నిందితుల వద్ద నుంచి రూ. 5 లక్షల, 50వేలను స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ నకిలీ 2000 నోట్లు.
నిందితులను విచారించి..
ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన స్పెషల్‌సెల్‌కు కొన్ని ప్రాంతాల్లో నకిలీ నోట్లు సర్క్యులేట్ అవుతున్నాయనే సమాచారం అందింది. ఈ మేరకు తనిఖీలు చేపట్టిన పోలీసులు అలీపూర్ ప్రాంతంలో తాజిమ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుంచి పోలీసులు రెండున్నర లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అతనిని విచారించిన అనంతరం కైరాన్‌లో ఇర్షాద్‌ను అరెస్టు చేసి,అతని ఇంటిలో నుంచి రూ. 3 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులు విచారణలో పలు విషయాలు తెలిపారు. ఫర్జీ వెబ్‌సిరీస్ చూసి తాము తమ దుకాణంలోనే దొంగనోట్లను ముద్రించామని, తరువాత వాటిని చెలామణి చేయడం ప్రారంభించామన్నారు.
వెబ్‌సైట్లను సెర్చ్ చేసి..
నకిలీ నోట్లు ముద్రించేందుకు పలు వెబ్‌సైట్లను సెర్చ్ చేశామని తెలిపారు. తరువాత నోట్లు ముద్రించేందుకు భారీగా పేపర్ కొనుగోలు చేయడంతోపాటు ప్రింటర్ కూడా తీసుకువచ్చామన్నారు. కాగా నిందితులు ఈ నకిలీ నోట్లను ఢిల్లీ-ఎన్‌సీఆర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లలో చలామణీ చేశారు.అయితే వీరు ఎంత మొత్తంలో దొంగనోట్లు ముద్రించారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇది కూడా చదవండి: ‘వందే భారత్’ ఢీకొని యువకుడు మృతి.. ఎక్కడంటే..
Comments
Please login to add a commentAdd a comment