
ఎల్లారెడ్డిలో బుల్లెట్ బైకుపై వెళ్తున్న ఎమ్మెల్యే జాజాల సురేందర్,
ఎల్లారెడ్డి: పట్టణంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే జాజాల సురేందర్ లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి అందజేశారు. బుధవారం ఎల్లారెడ్డి పట్టణంలోని 20 మంది లబ్ధిదారుల ఇంటింటికీ బుల్లెట్‌పై ఎమ్మెల్యే వెళ్లి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. పట్టణంలో బుల్లెట్‌పై ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లడంతో ఆయనను వింతగా చూశారు. ఎమ్మెల్యే ఏమిటి.. బుల్లెట్‌పై తిరగడమేంటి.. ఇంటింటికీ రావడం ఏమిటని ఒకరిని ఒకరు గుసుగులాడుకున్నారు. లబ్ధిదారులు కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే స్వయంగా తమ ఇంటికి వచ్చి అందజేయడాన్ని అందరూ చాలా సంతోషించారు. ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు కుడుముల సత్యం, ఇమ్రాన్, జలందర్ రెడ్డి, పద్మారావు, రవీందర్, నర్సింలు, సతీష్, శ్రీనివాస్, తిమ్మాపూర్ సర్పంచ్ దామోదర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment