ellareddy
-
ఎల్లారెడ్డిలో బీఆర్ఎస్ అభ్యర్థికి నిరసన సెగ
-
కాంగ్రెస్ వస్తే కుంభకోణాల కుంభమేళానే
సాక్షి, కామారెడ్డి: ‘యాభై ఏండ్లు అధికారం వెలగబెట్టిన కాంగ్రెసోళ్లు ఎన్ని ఘనకార్యాలు జేసిండ్రో జూసినం. ఇప్పుడు అధికారం కోసం అలవికాని హామీలు ఇస్తున్నరు. వాళ్ల మాటలు నమ్మితే మోసపోవుడే. అంతేగాదు వాళ్లు అధికారంలో ఉంటే కుంభకోణాల కుంభమేళా తీసుకువస్తరు..’అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు ఎల్లారెడ్డి పట్టణంలో సోమవారం పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశా రు. ఎల్లారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఎవరు కావాలో ఆలోచించుకోండి.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు దొంగరాత్రి కరెంటుతో ఎంతోమంది రైతులు కరెంటు షాకులు, పాముకాట్లకు బలయ్యారని, అప్పుడు అరిగోస పెట్టి, ఇప్పుడేమో చిలకపలుకులు పలుకుతున్నారని కేటీఆర్ విమర్శించారు. వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అంటున్నాడని, మూడు పంటల కేసీఆర్ కావాలా? మూడు గంటల కాంగ్రెస్ కావాలా? మతం పేరుతో మనమధ్య పంచాయతీ పెట్టే బీజేపీ కావాలా? రైతులు ఆలోచించాలన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలిచిందని, కాంగ్రెస్ మాటలు నమ్మి వాళ్లకు ఓట్లేస్తే రాష్ట్రం మళ్లీ పాత రోజుల్లోకి పోవలసి వస్తుందని హెచ్చరించారు. అప్పుడు ఎక్కడ చూసినా దుర్భిక్షం ఉండేదని, ఇప్పుడు మిషన్ కాకతీయతో చెరువులన్నీ బాగుపడి భూగర్భ జలాలు పెరిగాయని తెలిపారు. 24 గంటల కరెంటుతో రైతులు మంచి పంటలు పండిస్తున్నారని చెప్పారు. ఏం జేసిండ్రో చెప్పి ఓట్లడుగుండ్రి.. కాంగ్రెస్‌కు ఓటేస్తే ధరణి, రైతుబంధు, రైతుబీమా, దళితబంధు.. అన్నీ పోయి దళారుల రాజ్యం వస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలు, కాలిన మోటార్లతో రైతులు పడ్డ కష్టాలను గుర్తు తెచ్చుకుని ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. గడపగడపకు కాంగ్రెస్ అంటూ తిరుగుతున్న షబ్బీర్‌అలీ లాంటి నాయకులు యాబై ఏండ్లలో ఏం పీకిండ్రని మంత్రి నిలదీశారు. షబ్బీర్ మంత్రిగా ఉండి కామారెడ్డిని జిల్లా చేయలేదని, కామారెడ్డికి మెడికల్ కాలేజీ తీసుకురాలేదని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు తాము అధికారం వెలగబెట్టి ప్రజలకు ఏం జేసిండ్రో చెప్పి ఓట్లడగాలని పేర్కొన్నారు. ధరల పెరుగుదల పాపం కేంద్రంలోని బీజేపీదేనన్నారు. కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేసే గొప్పనాయకుడని చెప్పారు. రాష్ట్రంలో వెయ్యి ఒక్క గురుకులాలు తీసుకువచ్చి పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యనందిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో రెండొందలు ఉన్న పింఛన్‌ను తాము రూ.2 వేలకు, ఐదొందలు ఉన్న పింఛన్ రూ.నాలుగు వేలకు చేశామని తెలిపారు. అప్పుడు ఏది కావాలన్నా ఢిల్లీని అడగాల్సిందే.. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టే కేసీఆర్ తాను ఏది చేయాలన్నా కేబినెట్ మీటింగు పెట్టి నిర్ణయం తీసుకుంటాడని, అదే కాంగ్రెస్, బీజేపీలు అధికారంలోకి వస్తే ఏది కావాలన్నా ఢిల్లీని అడగాల్సి ఉంటుందని కేటీఆర్ చెప్పారు. బేకార్‌గాళ్లు, చేతగానోళ్లు, ఢిల్లీ గులామోళ్లు మనకవసరమా? అంటూ ప్రశ్నించారు. సభలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు. -
‘దృశ్యం’ సినిమాను తలపించిన సంఘటన.. ప్రియుడితో కలిసి భర్తను చంపి..
ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను చంపి పనిచేస్తున్న స్థలంలోనే పాతిపెట్టింది. ఆపై భర్త సోదరుడికి ఫోన్ చేసి అక్కడికి వచ్చాడా అని ఆరా తీసింది. అనంతరం ఏమీ ఎరుగని దానిలా అత్తారింటికి చేరింది. అనుమానం వచ్చి మృతుడి కుటుంబ సభ్యులు నిలదీయగా ఘాతుకం బయటపడింది. దృశ్యం సినిమాను పోలిన ఈ సంఘటన గురువారం కామారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. సాక్షి, కామారెడ్డి(ఎల్లారెడ్డి): కర్ణాటక రాష్ట్రంలోని బందెంపల్లి గ్రామానికి చెందిన ఎరుకల రమేశ్(26)కు వికారాబాద్ జిల్లా బషీ రాబాద్ మండలంలోని నీలపల్లి గ్రామానికి చెందిన వెన్నెలతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరు నాలుగేళ్ల క్రితం పటాన్చెరు ప్రాంతంలోని లింగంపల్లి శివారుకు కూలీలుగా వలసవచ్చారు. అక్కడ దౌల్తాబాద్ మండలం భూమిడాల గ్రామానికి చెందిన గంగపురి దస్తప్పతో వెన్నెలకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరగడంతో స్వగ్రామానికి తిరిగివెళ్లారు. రమేశ్ కుటుంబ సభ్యులకు వెన్నెల వివాహేతర సంబంధం గురించి తెలియడంతో ఇద్దరికీ సర్దిచెప్పారు. అనంతరం వారు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో ఓ ఇంటి నిర్మాణానికి కూలీలుగా వచ్చి పనులు చేసుకుంటూ ఇక్కడే ఉంటున్నారు. వెన్నెల ఎల్లారెడ్డిలో ఉంటున్నట్లు తెలుసుకున్న ఆమె ప్రియుడు రెండుమూడుసార్లు వచ్చి కలిశాడు. చదవండి: (భర్తతో గొడవ.. ఇద్దరు పిల్లలతో సహా వివాహిత అదృశ్యం) గతనెల 30న రాత్రి 11 గంటల సమయంలో అతడు రమేశ్ కంటపడ్డాడు. దీంతో దస్తప్ప అతడి గొంతు నులమగా భార్య వెన్నెల కాళ్లు పట్టుకుని హత్యకు సహకరించింది. అనంతరం మృతదేహాన్ని వారు పనిచేస్తున్న ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టారు. వెన్నెల మరుసటి రోజు రమేశ్ అన్న వెంకటప్పకు ఫోన్ చేసి తన భర్త ఎవరో బంధువులు మృతి చెందారని చెప్పి కర్ణాటకకు వచ్చాడని చెప్పింది. మూడు రోజుల క్రితం అత్తగారింటికి వెళ్లింది. అనుమానించిన రమేశ్ కుటుంబ సభ్యులు ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. దీంతో మృతుడి అన్న వెంకటప్ప గురువారం ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు. డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ శ్రీనివాస్, ఎస్సై గణేశ్ సంఘటన స్థలానికి చేరుకుని తహసీల్దార్ మునీరుద్దీన్ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహం కుళ్లిపోవడంతో వైద్యులు సంఘటన స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించి, మృతుడి బంధువులకు అప్పగించారు. రమేశ్‌ను హతమార్చిన వెన్నెల, దస్తప్పలకోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. చదవండి: (హైదాబాద్‌లో రోడ్డు ప్రమాదాలు.. ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగుల మృతి) -
గాంధీ భవన్‌కు చేరిన ఎల్లారెడ్డి పంచాయతీ
హైదరాబాద్: టీ కాంగ్రెస్ నేతలు మదన్ మోహన్‌రావు, సుభాష్ రెడ్డిల మధ్య వివాదం మరింత ముదరడంతో పార్టీలో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఎల్లారెడ్డిలో మొదలైన వీరి లొల్లి గాంధీ భవన్‌కు చేరింది. స్థానికంగా ఆధిపత్య పోరు కోసం యత్నించే క్రమంలో ఇరు వర్గాల మధ్య వివాదం రాజుకుంది. నువ్వు ఎంతంటే.. నువ్వు ఎంత అనే స్థాయికి చేరడంతో చివరకు కొట్లాటకు దారి తీసింది. ఈ క్రమంలోనే సుభాష్‌రెడ్డి వర్గీయులపై మదన్మోహన్ అనుచరుల దాడికి దిగారు. దాంతో మదన్మోహన్పై చర్యలు తీసుకోవాలని సుభాష్‌రెడ్డి వర్గం గాంధీ భవన్‌కు వచ్చింది. తక్షణమే మదన్మోహన్పై చర్యలు తీసుకోవాలని, అప్పటివరకూ గాంధీ భవన్ నుంచి వెళ్లేది లేదని సుభాష్‌రెడ్డి వర్గం అంటోంది. -
Etela Rajender: మాజీ మంత్రి వెంటే మాజీ ఎమ్మెల్యే
సాక్షి, కామారెడ్డి: ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి టీఆర్ఎస్కు దూరమైనట్లే కనిపిస్తోంది! పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పని చే సిన ఆయన.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీఆర్ఎస్కు దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే మంత్రిమండలి నుంచి బర్తరఫ్ అయిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ వెంట నడుస్తున్నారు. ఆయన కోటరీలో ఒకరిగా ఉంటూ ఆయన వెంటే తిరుగుతున్నారు. రాష్ట్రంలో కొత్త పార్టీ ఏర్పాటు చేయడమా.. ఇతర పార్టీలో చేరడమా? అన్న దానిపై రా జేందర్ వేస్తున్న అడుగుల్లో రవీందర్‌రెడ్డి వెన్నంటి ఉండడం గమనార్హం. ఈటల బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోన్న తరుణంలో ఆయన కూడా కాషాయ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారి పోనున్నాయి. చదవండి: Etela Rajender: బీజేపీలో చేరికపై బండి సంజయ్ క్లారిటీ గులాబీ జెండా ఆవిర్భావం నుంచి.. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో క్రియాశీలకంగా పని చేసిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డికి నియోజక వర్గంలో బలమైన కేడర్ ఉంది. 2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత నామినేటెడ్ పదవి దక్కుతుందన్న ఆశతో ఉన్నారు. అయితే, కాంగ్రెస్ నుంచి గెలిచిన జాజాల సురేందర్ అనూహ్యంగా గులాబీ గూటికి చేరడం, నియోజక వర్గ బాధ్యతలన్నీ ఆయనకు అప్పగించడంతో రవీందర్‌రెడ్డి ప్రాధాన్యత తగ్గింది. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో పని చేసిన తనను కాదని సురేందర్‌ను చేర్చుకోవడంతో మాజీ ఎమ్మెల్యే నిరాశ చెందారు. అయితే, పార్టీ అధినేత కేసీఆర్‌తో పాటు ముఖ్య నేతలతో ఉన్న సత్సంబంధాలతో నామినేటెడ్ పదవి దక్కుతుందని ఆశించారు. రెండున్నరేళ్లుగా పదవి దక్కక పోగా, పార్టీ కార్యక్రమాలకు సంబంధించి తనను, తన అనుచరులను పట్టించుకోక పోవడం రవీందర్‌రెడ్డికి ఇబ్బందికరంగా మారింది. చివరకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలోనూ రవీందర్‌రెడ్డికి, ఆయన అనుచరులకు నమోదు పుస్తకాలు ఇవ్వలేదు. దీంతో ఆయన తీవ్ర ఆవేదనకు గురైనట్టు సమాచారం. అప్పటి నుంచి ఆయన పార్టీ ముఖ్య నేతలకు దూరమవుతూ వచ్చారు. ఇటీవల ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి బయటకు పంపింన నేపథ్యంలో రవీందర్‌రెడ్డి.. ఈటలను కలిసి అండగా నిలిచారు. మొదటి నుంచి పార్టీలో కలిసి పని చేసిన వారు కావడం, రవీందర్‌రెడ్డి కూడా పార్టీ నాయకత్వంపై ఉన్న కోపంతో ఈటలతో కలిసి అడుగులు వేస్తున్నారు. టీఆర్ఎస్కు కొంత నష్టం.. ఏనుగు రవీందర్‌రెడ్డి టీఆర్ఎస్ను వీడితే ఎల్లారెడ్డి నియోజక వర్గంలో రాజకీయ సమీకరణలు మారుతాయని భావిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉద్యమాల్లో నియోజక వర్గ ప్రజలు చురకైన పాత్ర పోషించారు. రవీందర్‌రెడ్డి వెంట ఉద్యమంలో పాల్గొన్నారు. ఆయన ఓటమి చెందినా చాలా మంది నాయకులు, కార్యకర్తలు ఇప్పటికీ ఆయన వెన్నంటే ఉన్నారు. ఈటల కొత్త పార్టీ పెడితే రవీందర్‌రెడ్డి వెంట ఉన్న వారంతా ఆయనతో కలిసి పార్టీలో చేరే అవకాశాలున్నాయి. అయితే, ఈటల రాజేందర్ బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన వెంట ఏనుగు రవీందర్‌రెడ్డి కూడా కాషాయ గూటికి చేరతారని తెలిసింది. అదే జరిగితే ఎల్లారెడ్డి నుంచి గతంలో బీజేపీ తరఫున పోటీ చేసిన బాణాల లక్ష్మారెడ్డికి, ఏనుగు రవీందర్‌రెడ్డికి మధ్య టిక్కెట్ కోసం పోటీ తప్పదు. రవీందర్‌రెడ్డి కమలం గూటికి చేరితే ఎల్లారెడ్డి నియోజక వర్గం నుంచి ఒకరిని, జహీరాబాద్ ఎంపీ స్థానం నుంచి మరొకరిని నిలిపే అవకాశాలుంటాయనే చర్చ జరుగుతోంది. కాగా నియోజక వర్గంలో బలమైన కేడర్ కలిగి ఉన్న ఏనుగు రవీందర్‌రెడ్డి టీఆర్ఎస్ను వీడితే అధికార పార్టీకి కొంత నష్టం తప్పదని భావిస్తున్నారు. ఈటల కోటరీలో ఒకడిగా.. మాజీ మంత్రి ఈటల కోటరీలో ఒకరిగా ఏనుగు రవీందర్‌రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ, టీజేఎస్ తదితర పార్టీల నేతలను కలవడానికి వెళ్లిన ఈటల వెంట ఆయన ఉన్నారు. కొత్తగా పార్టీ ఏర్పాటు చేయడమా.. వేరే పార్టీలో చేరడమా? అన్న విషయంలో జరుగుతున్న చర్చల్లో రవీందర్‌రెడ్డి ఉండడం ద్వారా ఆయన టీఆర్ఎస్పై తిరుగుబాటు చేసినట్టుగానే భావిస్తున్నారు. తమ చర్చలు, ప్రయత్నాల గురించి రవీందర్‌రెడ్డి తన అనుచరులకు ఎప్పటికప్పుడు స మాచారం ఇస్తున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ తో ఇన్నేళ్ల అనుబంధాన్ని తెంచుకున్నట్టే కనిపిస్తోంది. ఏనుగు అనుచరులు చాలా రోజుల నుంచి పార్టీని వీడాలని, బీజేపీలో చేరాలని ఒత్తిడి తెచ్చారు. అప్పట్లో ఆయన బీజేపీలో చేరుతున్నాడన్న ప్రచారం కూడా జరిగింది. -
బుల్లెట్‌పై తిరుగుతూ.. చెక్కులు పంచుతూ..
ఎల్లారెడ్డి: పట్టణంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే జాజాల సురేందర్ లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి అందజేశారు. బుధవారం ఎల్లారెడ్డి పట్టణంలోని 20 మంది లబ్ధిదారుల ఇంటింటికీ బుల్లెట్‌పై ఎమ్మెల్యే వెళ్లి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. పట్టణంలో బుల్లెట్‌పై ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లడంతో ఆయనను వింతగా చూశారు. ఎమ్మెల్యే ఏమిటి.. బుల్లెట్‌పై తిరగడమేంటి.. ఇంటింటికీ రావడం ఏమిటని ఒకరిని ఒకరు గుసుగులాడుకున్నారు. లబ్ధిదారులు కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే స్వయంగా తమ ఇంటికి వచ్చి అందజేయడాన్ని అందరూ చాలా సంతోషించారు. ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కుడుముల సత్యం, ఇమ్రాన్, జలందర్ రెడ్డి, పద్మారావు, రవీందర్, నర్సింలు, సతీష్, శ్రీనివాస్, తిమ్మాపూర్ సర్పంచ్ దామోదర్ ఉన్నారు. -
కుక్కను తప్పించబోయి..
సాక్షి, సదాశివనగర్(ఎల్లారెడ్డి): కుక్కను తప్పించబోయి కారు అదుపుతప్పి బోల్తా కొట్టడంతో ఒకరు మృతి చెందిన సంఘటన మంగళవారం సదాశివనగర్ మండల కేంద్రం శివారు 44వ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. గాంధారి మండల కేంద్రానికి చెందిన సామల సురేశ్ కుమార్(32) కొంత కాలంగా కామారెడ్డిలోని కల్కీనగర్‌లో నివాసం ఉంటున్నాడు. స్వగ్రామమైన గాంధారిలో పని ఉందని ఇంట్లో చెప్పి మిత్రుని కారు టీఎస్ 09ఈఎఫ్ 6093 తీసుకుని బయలుదేరాడు. సదాశివనగర్ శివారుకు రాగానే రోడ్డుపై ఉన్న కుక్కను తప్పించబోయాడు. వేగంగా ఉన్న కారు అదుపు తప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. కారు పూర్తిగా నుజ్జయింది. కారు డ్రైవ్ చేస్తున్న సురేశ్‌కుమార్‌కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు 108లో కా మారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చూసి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతునికి భార్య నాగలత, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. -
తెలంగాణలో రైతు ఆత్మహత్యలు : ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్
సాక్షి, నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర, బోనస్ ప్రకటించకపోవడం వల్ల తెలంగాణరాష్ట్రం ఏర్పడిన నాలుగేళల్లో రాష్ట్రంలో 4,500మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, దీనివల్ల తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ పేర్కొన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలో బీజేపీ అభ్యర్థి బాణాల లక్ష్మారెడ్డి తరఫున ‘మార్పు కోసం–బీజేపీ’ పేరిట శనివారం నిర్వహించిన ప్రచారసభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేసి వంచించారని విమర్శించారు. గిరిజన రాష్ట్రంగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌ను తాను దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల జాబితాలో చేర్చానన్నారు. 2014 ఎన్నికల్లో కేసీఆర్ ప్రజలకు అనేక వాగ్ధానాలు చేసి ఏ ఒక్క హామీని సంపూర్ణంగా నెరవ్చేలేదని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలకు సాగు, తాగునీటిని అందించేందుకు ప్రవేశపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ పథకాల్లో ఎంతో అవినీతి కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కేవలం 30 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమకు ఉద్యోగాలు వస్తాయనే ఆశతో ఎంతోమంది యువకులు ఎన్నో పోరాటాలు చేశారన్నారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం వారి ఆశలన్నీ నిరాశ చేశాడని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తమ రాష్ట్రంలో క్వింటాల్ ధాన్యానికి రూ. 2,080 చొప్పున చెల్లిస్తున్నామని, గడిచిన రెండు నెలల్లో 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, ఇందుకుగాను రైతుల ఖాతాల్లో రూ. 14 వేల కోట్లు జమ చేశామన్నారు. తమ పార్టీఅభ్యర్థి బాణాల లక్ష్మారెడ్డికి ఓటువేసి గెలిపిస్తే రైతుల కష్టాలను ప్రధానమంత్రి నరేంద్రమోడీ దృష్టికి తీసుకెళ్లే అవకాశం వస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షల మంది దళితులుండగా ఇప్పటివరకు 5 వేల మందికి మాత్రమే 3 ఎకరాల చొప్పున భూ పంపిణీ చేశారన్నారు. పేదప్రజలకు డబుల్‌బెడ్ రూం ఇళ్లు కట్టిస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పటివరకు సింగిల్‌బెడ్ రూం ఇళ్లు కూడా కట్టించలేకపోయారని విమర్శించారు. ఒకవైపు నుంచి కేసీఆర్.. మరోవైపు నుంచి మహాకూటమి వస్తుందని, ప్రజలు బీజేపీకి ఓటువేసి వారికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఎన్నికల సందర్భంగా తెలంగాణలో మహాకూటమి తరపున రాహుల్‌గాంధీ ఎక్కడ ప్రచారంచేసినా అక్కడ వారి అభ్యర్థి ఓడిపోతారన్నారు. రాహుల్‌గాంధీ ప్రచారం మహాకూటమి శాపంగా మారుతుందన్నారు. దేశంలో 75శాతం రాష్ట్రాల్లో బీజేపీ పాలన కొనసాగుతుందన్నారు. బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఉజ్వల యోజన ద్వారా బీజేపీ ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ కనెక్షన్లను అందజేస్తుందని వివరించారు. 2022 నాటికి దేశంలో అందరికీ పక్కా ఇళ్లు ఉండేలా మోడీ నాయకత్వం పనిచేస్తుందన్నారు. తెలంగాణలో తమపార్టీ అధికారంలోకి రాగానే రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఆయన ప్రకటించారు. ఆయూష్మాన్ భారత్ ద్వారా ప్రతిఒక్కరికి రూ. 5 లక్షల విలువైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తామన్నారు. దీంతోపాటు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచుతామన్నారు. డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటువేయాలని ఆయన కోరారు. -
అభివృద్ధే లక్ష్యంగా..
సాక్షి, నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో ఎల్లారెడ్డిలో అధికార పార్టీకి చెందిన వ్యక్తి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో వెనుకబడిన నియోజకవర్గంగా పేరొందిన ఈ ప్రాంతం ఇప్పుడిప్పుడే అభివృద్ధివైపు అడుగులు వేస్తోంది. గతంలో టీడీపీకి కంచుకోటగా ఉన్న ఎల్లారెడ్డిలో మొదటిసారిగా 2004లో టీఆర్ఎస్ నుంచి రాజకీయ అరంగ్రేటం చేసిన ఏనుగు రవీందర్‌రెడ్డి గులాబీ జెండాను ఎగురవేశారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో టీఆర్ఎస్ క్యాడర్‌ను పెంచుకున్నారు. 2008లో నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్అభ్యర్థి జనార్దన్‌గౌడ్ చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం 2009, 2010, 2014లలో జరిగిన ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో నియోజకవర్గంలోని ప్రతిగ్రామంలో టీఆర్ఎస్కు బలమైన క్యాడర్ ఏర్పడింది. గతంలో నాలుగుసార్లు రవీందర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో ఆయన ప్రతిపక్షంలోనే కూర్చోవాల్సి వచ్చింది. కానీ 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారం చేపట్టడంతో ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యేగా గెలుపొందిన రవీందర్‌రెడ్డికి అధికార పార్టీ ఎమ్మెల్యేగా హోదా వచ్చింది. చేపట్టిన అభివృద్ధి పనులు నాలుగున్నరేళ్లలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సుమారు రూ. 760 కోట్ల నిధులు మంజూరు చేయించారు. ముఖ్యంగా వ్యవసాయాధారితంగా జీవనం సాగించే నియోజవర్గ రైతాంగానికి కరెంట్కష్టాలు తొలగిపోయేలా ఎల్లారెడ్డి మండలంలో రూ. 8 కోట్ల నిధులతో 132/33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు చేయించారు. ప్రస్తుతం దీని నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీంతోపాటు పలు గ్రామాల్లో రూ. 15 కోట్లు వెచ్చించి 33/11కేవీకి సంబంధించి 15 విద్యుత్ సబ్స్టేషన్లను మంజూరు చేయించారు. నియోజకవర్గంలో సుమారు 275 కిలోమీటర్ల రోడ్లు పనులకు ఆర్అండ్బీ ద్వారా రూ. 240 కోట్ల నిధులను మంజూరు చేయించారు. 661 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్లకు శాఖ ద్వారా రూ. 133 కోట్ల నిధులను మంజూరు చేయించారు. నియోజకవర్గంలో 500మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల నాలుగు గోదాంల నిర్మాణానికి రూ. 12 కోట్లు కేటాయింపజేశారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా రూ. 151 కోట్ల నిధులతో నియోజకవర్గంలో 427 చెరువులకు పునఃరుద్ధరణ పనులు చేయించారు. దీంతోపాటు ఎల్లారెడ్డి పట్టణంలో రూ. 4.50 కోట్ల నిధులను వెచ్చించి 30 పడకల ఆస్పత్రి భవనాన్ని నిర్మింపజేశారు. నియోజవర్గంలో బీసీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయించారు. దీంతోపాటు నాగిరెడ్డిపేట మండలంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేయించారు. కాగా నియోజవర్గంలోని అమర్లబండ, ధర్మరావుపేట, మోతె, గుర్జుల్, కాటేవాడి డ్యాంలను నిర్మింపజేసి నియోజకవర్గానికి 10 టీఎంసీల సాగునీరు వచ్చేలా ప్రణాళిక రూపొందించారు. ఎల్లారెడ్డికి డివిజన్హోదా కల్పించడంతోపాటు ఎల్లారెడ్డిని మున్సిపాలిటీగా మార్చడం వల్ల ప్రజలకు చక్కని సేవలు అందే అవకాశాలు కల్పించబడ్డాయి. అమలవుతున్న పథకాలు ఆసరా పిఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మిషన్ కాకతీయ, రైతుభీమా, రైతుబంధు, సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం, మత్స్యకారుల పనిముట్లు, కేసీఆర్ కిట్ల పంపిణీ. ప్రధాన సమస్యలు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యంగా రోడ్ల సమస్య ప్రజలను వేధిస్తుంది. బోధన్–మైదక్–హైదరాబాద్ రోడ్డుతో పాటు ఎల్లారెడ్డి–కామారెడ్డి కరీంనగర్ రోడ్డు పూర్తి అధ్వానంగా మారింది. ఎల్లారెడ్డిలో 30 పడకల ఆస్పత్రి భవనం నిర్మించినా పూర్తిస్థాయిలో సిబ్బంది నియామకం కాకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతోపాటు నియోజకవర్గంలోని యువతకు ఉపాధి అవకాశాలు లేకపోవడం, ఎల్లారెడ్డి బస్సుడిపో ఏర్పాటు వాయిదాపడడం, నియోజకవర్గంలోని చాలా గ్రామాలకు బస్సుసౌకర్యం లేదు. పోచారంప్రాజెక్టు ఆధునికీకరణ పనులు చేపట్టకపోవడం, నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఉన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రొఫైల్సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రొఫైల్ ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన ఏనుగు రవీందర్‌రెడ్డి మొదట సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్లో శానిటరీ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వమించేవారు. కాగా తెలంగాణ ఉద్యమం మొదలైన తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో రవీందర్‌రెడ్డి తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఎల్లారెడ్డి అసెంబ్లీస్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణవాదంతో రాజకీయ అరంగ్రేటం చేసిన రవీందర్‌రెడ్డి కేసీఆర్ ఆదేశాల మేరకు 2008లో తన పదవికి రాజీనామా చేశారు. 2008లో ఎల్లారెడ్డికి జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి జనార్దన్గౌడ్చేతిలో ఓడిపోయారు. 2009లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీచేసిన రవీందర్‌రెడ్డి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో రవీందర్‌రెడ్డి తన పదవికి రెండోసారి రాజీనామా చేశారు. దీంతో 2010లో జరిగిన ఉపఎన్నికల్లో రవీందర్‌రెడ్డి మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా 2014లో జరిగిన ఎన్నికల్లో రవీందర్‌రెడ్డి నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 లో పోల్ అయిన ఓట్లు రవీందర్‌రెడ్డి 70,760 సురేందర్‌రెడ్డి 46,751 పోలైన ఓట్లు 1,58,015 మొత్తం ఓటర్లు 1,85,055 మెజారిటీ 24,009 2018 ఓటర్ల జాబితా పొలింగ్కేంద్రాలు 259 పురుషులు 92,308 మహిళలు 99,267 ఇతరులు 14 మొత్తం ఓటర్లు 1,91,589 -
కుందేలు వేటగాళ్ల అరెస్టు
ఎల్లారెడ్డి: కుందేలును వేటాడినవారిని అరెస్టు చేసినట్లు ఎల్లారెడ్డి అటవీశాఖ రేంజ్ అధికారి రాధాకిషన్ గురువారం తెలిపారు. మండలంలోని దేవునిపల్లి గ్రామ శివారులో కుందేళ్లను వేటాడుతూ, వేటగాళ్లు పట్టుబడినట్లు ఆయన తెలిపారు. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన మండిరాం, భీమా అనే ఇద్దరు యువకులు కుందేళ్లతో పట్టుబడినట్లు ఆయన తెలిపారు. అటవీశాఖ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు రేంజ్ అధికారి తెలిపారు. -
టీఆర్ఎస్లోకి మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌గౌడ్
హైదరాబాద్: టీడీపీకి చెందిన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే కె.జనార్దన్‌గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ఆదివారం ఆయన మెదక్ జిల్లాలోని ఫాంహౌస్‌లో కేసీఆర్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా గౌడ్‌తోపాటు టీడీపీకి చెందిన పలువురు మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల స్థాయి ముఖ్య నేతలు టీఆర్ఎస్లో చేరారు