amarnathreddy
-
కుప్పంలో మరోసారి రెచ్చిపోయిన టీడీపీ గూండాలు
-
వైఎస్సార్సీపీ కార్యకర్తపై దాడి
సోమందేపల్లి: మండలంలోని చల్లాపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త అంజినరెడ్డిపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు గ్రామంలో జన్మభూమి కమిటీ సభ్యుల పెత్తనం, ఇసుక అక్రమ తరలింపుపై ప్రశ్నించడంతో పాటు అధికారుల దృష్టికి ఫిర్యాదులు తీసుకువెళుతున్నానన్న కారణంతో తనపై కక్ష సాదింపులకు దిగారన్నారు. బుధవారం రాత్రి గ్రామంలో ఉండగా టీడీపీ నాయకులు సంజీవరెడ్డి, అమర్నాథ్రెడ్డితోపాటు మరి కొంతమంది తనపై దాడికి దిగి చిటికెన వేలిని విరగ్గొట్టారన్నారు. అనంతరం గ్రామస్తులు వచ్చి అడ్డుకోవడంతో పారిపోయారన్నారు. పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లగా అక్కడికి వచ్చి చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారని బాధితుడు ఆరోపించాడు. ఇటీవల జరిగిన జన్మభూమి కార్యక్రమంలో కూడా అంజినరెడ్డి గ్రామ సమస్యలపై టీడీపీ నాయకులను నిలదీయడంతో ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. దాడికి సంబంధించి బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
వరద బాధితులకు సరుకుల పంపిణీ
వైఎస్సార్ జిల్లా: రాజంపేటలో వైఎస్సార్సీపీ నాయకులు వరద ముంపు బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మండలంలోని ముకుందారిగడ్డలో వరద నీటిలో చిక్కుకున్న బాధితులను పరామర్శించి సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత ఐదు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని పలు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే చిక్కుకొని ఉన్నాయి. -
వరద బాధితులకు వైఎస్సార్సీపీ పరామర్శ
వైఎస్సార్ జిల్లా: రైల్వే కోడూరులో వరద బాధితులను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి మంగళవారం పరామర్శించారు. రైల్వే కోడూరులో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వేల ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. ధర్మాపురం, గాండ్లవీధిలో వరద బాధితులను నాయకులు పరామర్శించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరద పరిస్థితులపై అమరనాథ్రెడ్డితో ఫోన్లో మాట్లాడిన విషయం తెలిసిందే.