
సాక్షి, అమరావతి: గత వారం రోజులుగా సంభవిస్తున్న వరదల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉభయగోదావరి జిల్లాల్లో వరద బాధితులకు నిత్యావసర సరుకులను ఉచితంగా పింపిణీ చేయాలని ప్రభుత్వం సోమవారం ఆదేశించింది. ఈ మేరకు ముఖ్యమ్యంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాలలో నిత్యావసర సరకులను పంపిణీ చేయాలని అధికారలను ఆదేశించారు. ఈ నేపథ్యంలో 25 కిలోల రైస్(బియ్యం)తో పాటు మొత్తం ఆరు రకాల సరుకులు అందించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కాగా వరదల కారణంగా వారానికి పైగా జలమయమైన ప్రాంతాల్లోని కుటుంబాలకు ఉచిత రేషన్ అందించాలని ఉత్తర్వుల్లో సర్కార్ పేర్కొంది.