![TFCC President Pratani Ramakrishna Goud Donates Essential Goods - Sakshi](/styles/webp/s3/article_images/2020/04/23/Prathani.jpg.webp?itok=dSXEi0J4)
కరోనా వైరస్ ప్రభావంతో నెలకొన్న లాక్ డౌన్ నేపథ్యంలో ‘తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్’లోని 100 మంది కళాకారులకు, సాంకేతిక నిపుణులకు ‘తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్’ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సంస్థ కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ చేతుల మీదుగా వీటిని పంపిణీ చేశారు. ‘‘గతంలో కొంత మందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. మళ్లీ ఈరోజు మరో వందమందికి పంపిణీ చేయడం అభినందనీయం’’ అన్నారు బూర నర్సయ్య గౌడ్. ‘‘పది కేజీల బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులు అందించాం. త్వరలో మరికొంత మందికి అందిస్తాం’’ అన్నారు ప్రతాని రామకృష్ణ గౌడ్. ఈ కార్యక్రమంలో ‘తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్’ కార్యదర్శి కాచం సత్యనారాయణ, తెలంగాణ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment