Case Filed Against Minister Talasani Srinivas Yadav Son Over Car Accident - Sakshi
Sakshi News home page

మంత్రి తలసాని కుమారుడిపై కేసు నమోదు

Published Sun, Nov 7 2021 9:50 AM | Last Updated on Sun, Nov 7 2021 10:33 AM

Case Filed Against Minister Talasani Son Over Car Accident - Sakshi

సాక్షి, ఖైరతాబాద్‌ (హైదరాబాద్‌): మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కుమారుడు తలసాని సాయికిరణ్‌ యాదవ్‌పై సైఫాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలివీ... ఖైరతాబాద్‌లో శుక్రవారం రాత్రి జరిగిన సదర్‌ ఉత్సవాలకు హాజరయ్యేందుకు మంత్రి తనయుడు తలసాని సాయికిరణ్‌ యాదవ్‌ తన కారులో వస్తున్నారు.

ఈ క్రమంలో రైల్వే గేటు సమీపంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నడుచుకుంటూ వెళ్లున్న ఇందిరానగర్‌కు సంతోష్‌(32) ఎడమ పాదం పైనుంచి మంత్రి కుమారుడు ప్రయాణిస్తున్న కారు టైరు వెళ్లింది. ఈ ఘటనలో సంతోష్‌ గాయపడ్డాడు. ఆయనను వెంటనే కిమ్స్‌ హాస్పిటల్‌కు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కారు నడుపుతున్న తలసాని సాయికిరణ్‌ యాదవ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సైఫాబాద్‌ పోలీసులు తెలిపారు.   

చదవండి: (నేను జయలలిత కుమార్తెనే.. అమ్మ కంటే ఆస్తి పెద్దది కాదు: జయలక్ష్మి) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement