మీడియా అత్యుత్సాహంపై మండిపడ్డ గట్టు | Media huge partiality in Poll coverage: Gattu | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 23 2013 5:06 PM | Last Updated on Wed, Mar 20 2024 3:45 PM

పంచాయతీ ఎన్నికల విషయంలో మీడియా అత్యుత్సాహంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు మండిపడ్డారు. ఈ ఫలితాలపై ఒకవర్గం మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని, కాంగ్రెస్, టీడీపీల మధ్య పోటీ జరుగుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. వార్డు సభ్యుల కౌంటింగ్ పూర్తయిన తర్వాతే సర్పంచ్ ఎన్నికలకు కౌంటింగ్ జరుగుతుందని, ఆ విషయం సదరు ఛానల్‌కు తెలియకపోవడం దారుణమని గట్టు అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఆ ఛానల్ దిగజారి వ్యవహరిస్తోందని ఆయన ధ్వజమెత్తారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement