Gattu
-
‘గట్టు ఎత్తిపోతల’లో భారీ గోల్మాల్!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జోగుళాంబ గద్వాల జిల్లాలో గట్టు (నల సోమనాద్రి) ఎత్తిపోతల పథకానికి సంబంధించి భూ పరిహారం పంపిణీలో భారీ గోల్మాల్ చోటుచేసుకుంది. ఇటు రికార్డులు లేకున్నా అటు పొజిషన్లో లేకున్నా.. పలువురికి పరిహారం చెల్లించినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ బాగోతంలో రూ.3.74కోట్లు దుర్వినియోగం కావడం కలకలం రేపుతోంది. అసలు ఏం జరిగిందంటే.. కరువు పీడిత ప్రాంతమైన జోగుళాంబ గద్వాల జిల్లాలోని గట్టు, కేటీదొడ్డి, ధరూర్, మల్దకల్ మండలాల్లోని 33వేల ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు గట్టు ఎత్తిపోతల పథకానికి అంకురార్పణ జరిగింది. ఈ మేరకు కుచ్చినెర్ల గ్రామ శివారులో రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రిజర్వాయర్, కట్ట నిర్మాణంలో మొత్తం 955.45 ఎకరాలు ముంపునకు గురవుతున్నట్లు అంచనా వేశారు. ఇందులో 574 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉన్నట్లు తేల్చారు. ముంపు ప్రాంతానికి సంబంధించి 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఎకరాకు రూ.7.80లక్షల పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో భూములు కోల్పోతున్న వారి పేర్లు, వారికి ఎంతెంత భూమి ఉంది.. ప్రభుత్వ భూమిలో పొజిషన్లో ఉన్న వారు ఎంతమంది.. వంటి వివరాలు సేకరించి ఈ ఏడాది ఏప్రిల్‌లో 155మందితో కూడిన జాబితాను కుచ్చినెర్ల గ్రామపంచాయతీలో అధికారులు ప్రదర్శించారు. నోటీసులు అందజేసి.. ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఆ తర్వాత మారిన సీన్.. ఇంతవరకు బాగానే ఉన్నా.. అధికార పార్టీకి చెందిన పలువురు రాజకీయ నాయకుల జోక్యంతో అక్రమా లకు తెరలేచింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రాజెక్ట్‌లో ముంపునకు గురవుతున్న ప్రభుత్వ భూము లకు సంబంధించి పట్టాలు లేకున్నా, పొజిషన్లో ఉంటే సరిపోతుందని అధికారులు చెప్పడాన్ని అక్రమా ర్కులు అదునుగా తీసుకున్నారు. ప్రభుత్వ భూమిలో పట్టా లేనప్పటికీ, పొజిషన్లో లేకున్నప్పటికీ మరో 17మందిని పొజిషన్లో ఉన్నట్లు చూపిస్తూ.. వారి పేర్లను పరిహారం జాబితాలో చొప్పించారు. ఇందకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలోని కొందరు సిబ్బంది, సర్వేయర్లు అండదండలు అందించినట్టు తెలుస్తోంది. మొత్తంగా ఇలా 17 మందికి సంబంధించి రూ.3.76కోట్లు దండుకున్నట్లు సమాచారం. బ్యాంకులో పరిహారం డబ్బులు పడిన తర్వాత ఆ 17మంది నుంచి సదరు నేతలు రికవరీ కూడా చేసుకున్నారని అంటున్నారు. అయితే ఇలా 17మందిని అడ్డుపెట్టు కుని అధికారపార్టీ నేతలు రూ.కోట్లు దండుకున్న విషయం ఓ ముఖ్య నేత దృష్టికి రాగా ఆయన సీరియస్ అయినట్టు తెలిసింది. ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో గుట్టుచప్పుడు కాకుండా విషయం రచ్చ కాకుండా సెటిల్ చేసుకోవాలని సదరు ముఖ్యనేత క్లాస్ పీకినట్టు సమాచారం. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం 17 మందికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదు రాలేదు. వివరాలు సేకరించి క్షేత్ర స్థాయిలో మరోసారి విచారణ చేపడతాం. అక్రమాలు నిజమని రుజువైతే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. – వల్లూరు క్రాంతి, కలెక్టర్, జోగుళాంబ గద్వాల. ఇది కూడా చదవండి: బఫర్ జోన్లో ఎలా నిర్మిస్తారు? -
అరుదైన ఖురాన్.. ఏడాదిలో ఒకసారి బయటికి..
సాక్షి, గట్టు (గద్వాల): సుమారు 238 ఏళ్ల నాటివిగా భావిస్తున్న అరుదైన.. అగ్గి పెట్టేకన్నా చిన్న సైజులోని పవిత్ర ఖురాన్ గ్రంథాలను మిలాదున్ నబీ సందర్భంగా బయటకు తీశారు. గట్టులోని జామీయా మసీదు, బిచ్చాలపేటలోని మసీదులో ఈ గ్రంథాలు ఉండగా.. ఏడాదిలో ఒకేఒక్క సారి మాత్రమే బయటకు తీస్తారు. మొత్తం 480 పేజీలు... 30 పారే (పర్వాలు)లు ఈ గ్రంథంలో ఉన్నాయి. ఇందులోని అక్షరాలను భూతద్దం ద్వారా చూస్తేనే కంటికి కన్పిస్తాయి. ఇక్కడి ముస్లింలు తరతరాలుగా ఈ గ్రంథాలను పవిత్రంగా బావిస్తూ, భద్రపరుస్తూ వస్తున్నారు. ఖురాన్‌ను మంత్రోచ్ఛరణల మధ్య మత పెద్దలు బయటకు తీస్తారు. కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే సందర్శనార్థం ఉంచి మళ్లీ లోపల భద్రపరుస్తారు. ఈ గ్రంథాన్ని దర్శించుకుంటే సర్వ పాపాలు తొలగిపోతాయనేది ఇక్కడి వారి నమ్మకం. మొగల్ కాలం నుంచి.. మొగల్ చక్రవర్తి ఔరంగజేబు కాలంలో గట్టులో జామీయా మసీదును నిర్మించినట్లుగా స్థానిక ముస్లిం మత పెద్దలు చెబుతున్నారు. తరతరాలుగా ఈ అతి చిన్న పరిమాణం (ఇంచున్నర) ఉన్న ఖురాన్ గ్రంథాన్ని ఎంతో భక్తితో, జాగ్రత్తగా మసీదులో భద్రపరుస్తున్నారు. మక్కా, మదీనా నుంచి ఈ గ్రంథంతో పాటు ఆసర్ ముబారక్ (మహమ్మద్ ప్రవక్త వెంట్రుక) తీసుకువచ్చారని పేర్కొన్నారు. ప్రతీ ఏడాది వీటిని దర్శించుకునేందుకు ఇతర ప్రాంతాలకు చెందిన ముస్లీంలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. -
గట్టు.. లోగుట్టు!
సాక్షి, గట్టు (గద్వాల): పంచాయతీకి అత్యంత కీలకమైన రివిజన్ రిజిస్టర్ గట్టు పంచాయతీలో మాయం చేశారు. పంచాయతీలో ఎన్ని గృహాలు ఉన్నాయి.. ఖాళీ స్థలాలు.. వ్యాపార దుకాణాలు ఇలా అన్ని రకాల వాటికి సంబంధించిన అత్యంత కీలమైనది రివిజన్ రిజిస్టర్. ప్రస్తుతం ఈ రిజిస్టర్ కనిపించడం లేదు. గతంలో ఇక్కడ పని చేసి, ఇదే మండలంలో వేరే పంచాయతీలో పనిచేస్తున్న కార్యదర్శికి, ప్రజాప్రతినిధి భర్తకు మధ్య పంచాయతీ నిధుల వాటాల పంపకాల్లో తేడాల కారణంగా ఓ నేత రివిజన్ రికార్డులను మాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతోపాటు పంచాయతీ నిధులకు సంబంధించిన జమ, ఖర్చుల రికార్డులు సైతం పంచాయతీలో కనిపించకుండా చేశారు. 2017 నుంచి వసూలు చేసిన ఇంటి పన్నులు ఎక్కడ జమ చేశారో తెలియని పరిస్థితి నెలకొంది. గతంలో ఇక్కడ పనిచేసిన పంచాయతీ కార్యదర్శులు వారి హ యాంలో విలువైన ఖాళీ స్థలాలకు సంబంధించి పంచాయతీ రికార్డులో నమోదు చేసి, పాత తేదీల్లో పొజీషన్ సర్టిఫికెట్లను జారీ చేశారు. తాజాగా గ్రామ పంచాయతీలో చేపట్టిన 30 రోజుల ప్రణాళికలో పంచాయతీ స్థలాలను చదును చేస్తుండటంతో ఆయా అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. రికార్డులు అప్పగించలే.. గట్టు పంచాయతీకి సంబంధించిన రివిజన్ రిజిస్టర్‌తోపాటు ఇతర రికార్డులను అప్పగించని వ్యవహారంపై జిల్లా పంచాయతీ అధికారి కృష్ణ గట్టు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శనివారం గట్టు పర్యటనకు వచ్చిన కలెక్టర్ శశాంక దృష్టికి గట్టు–1 ఎంపీటీసీ సభ్యురాలు మహేశ్వరి భర్త రామునాయుడు, మరికొందరు యువకులు రివిజన్ రిజిస్టర్ లేని విషయాన్ని తీసుకువచ్చారు. దీంతో గతంలో ఇక్కడ పనిచేసి వెళ్లిన ఆరుగురు పంచాయతీ కార్యదర్శులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించిన తరుణంలో డీపీఓ గట్టు పోలీస్‌స్టేషన్‌లో పంచాయతీ రికార్డులను అప్పగించని వారిపై ఫిర్యాదు చేశారు. కార్యదర్శులు రికార్డులతోపాటు పంచాయతీ నిధులు సైతం పెద్దఎత్తున స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రూ.40 లక్షలకు రికార్డులేవీ..? గట్టు పంచాయతీలో 13, 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.40,56,656లకు సంబంధించి ఎలాంటి రికార్డులు లేకుండానే డ్రా చేసుకున్న వ్యవహారంపై 2017లో జిల్లా పంచాయతీ అధికారి అప్పటి సర్పంచ్‌కు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. 2018లో పంచాయతీ నిధులు రూ.1,35,764 ఎలాంటి పనులు లేకుండా పంచాయతీ కార్యదర్శి, అప్పటి సర్పంచ్ స్వాహా చేసినట్లు అప్పట్లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై గట్టు– 2 ఎంపీటీసీ సభ్యురాలు నాగవేణి, వార్డు సభ్యులు కలిసి విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు విచారణ చేపట్టారు. -
గీత దాటితే వాత!
సాక్షి, గట్టు: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుంది. పోలీసులు ఉదయం, సాయంత్రం వేళల్లో వాహన తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నారు. నిబంధనలు అతిక్రమించే వారికి జరిమానాలను విధిస్తున్నారు. దీంతో వాహనదారుల్లో భయం పుట్టుకుంది. ఒకప్పుడు నగర ప్రాంతాలకే పరిమితమైన ఈ–చలాన్ విధానాన్ని ఇప్పుడు పల్లెలకు విస్తరించారు. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రస్తుతం ఈ–చలాన్ విధానాన్ని కొనసాగిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించే వాహనదారులకు ఈ–చలాన్ ద్వారా జరిమానాలు వెంటాడుతున్నాయి. ప్రధాన కూడళ్ల వద్ద వాహన తనిఖీలను చేపడుతున్న పోలీసులు, నిబంధనలు అతిక్రమించిన వారికి అక్కడికక్కడే ఈ చలాన్ ద్వారా జరిమానాలు విధిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు, డ్రైవింగ్ నిబంధనల అమలుకు పోలీసులు కృషిచేస్తున్నారు. మోటార్ వాహనచట్టం 250 సెక్షన్ ప్రకారం నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానాలను విధిస్తున్నారు. నిత్యం వాహన తనిఖీలు.. ప్రధాన రోడ్ల వెంట స్థానిక పోలీసులు నిత్యం వాహన తనిఖీలు చేపడుతున్నారు. ముఖ్యంగా కర్నూలు–రాయచూర్ అంతర్ రాష్ట్ర రహదారితో పాటుగా గట్టు, మల్దకల్, గట్టు, ధరూరు, గట్టు చింతలకుంట, గట్టు మాచర్ల గ్రామాలకు సంబంధించిన ప్రధాన రహదారుల వెంట వాహన తనిఖీలు చేపడుతున్నారు. తనిఖీల సందర్భంగా నిబంధనలు అతిక్రమించిన వాహనదారులను నిలిపి, అనుమతి పత్రాలను పరిశీలిస్తున్నారు. వాహనదారులను ట్యాబ్ ద్వారా ఫొటో తీసి, వాహన నిబంధన ఉల్లంఘనకు సంబంధించిన సమాచారాన్ని ట్యాబ్‌లో అప్లోడ్ చేస్తున్నారు. వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ నమోదు చేయగానే వాహనానికి సంబంధించిన పూర్తి సమాచారం ట్యాబ్ స్క్రిన్‌పై కన్పిస్తుంది. వాహనదారుడు ఏ నిబంధన ఉల్లంగించారనే దాని ప్రకారం వాహనదారునికి జరిమానా విధిస్తున్నారు. జరిమానాకు సంబంధించిన రశీదును అక్కడే వాహనదారునికి అందజేస్తున్నారు. ఆ తర్వాత వాహనదారుడు మీసేవ, ఈ సేవ, నెట్ బ్యాంకింగ్ వంటి ఆన్లైన్ సేవల ద్వారా జరిమానాను చెల్లించవచ్చు. వీటికి జరిమానాలు.. పరిమితికి మించి వాహనాల్లో ప్రయాణికులను తరలించడం, మద్యం తాగి వాహనాన్ని నడపడం, వాహనానికి సంబంధించిన అనుమతి పత్రాలు లేకపోవడం, వాహనానికి పిట్నెస్ లేకపోవడం, అధిక శబ్దాలు చేయడం, రాంగ్ రూట్లో ప్రయాణించడం, ద్విచక్ర వాహనాలపై ము గ్గురు ప్రయాణించడం, నెంబర్ ప్లేటు సక్రమంగా లేకపోవడం, తనిఖీ సిబ్బందికి సహకరించకపోవడం వంటి అనేక కారణాలతో వాహనదారులకు అక్కడికక్కడే జరిమానాలను విధిస్తున్నారు. ప్రమాదాల నివారణ కోసమే.. రోడ్డు ప్రమాదాల నివారణ కోసమే ఈ చలాన్ విధానాన్ని అమలు చేస్తున్నాం. ఈ విధానం ద్వారా జరిమానాలు విధించడమే కాకుండా వాహనదారులకు అవగాహన కూడా కల్పిస్తున్నాం. వాహన నిబంధనలు పాటిస్తూ.. అన్ని రకాల అనుమతులను వాహనదారులు కల్గి ఉండాలి. వాహనదారుడు అనుకోని విధంగా ప్రమాదం బారిన పడి, నష్టం జరిగితే, ఆ కుటుంబ సభ్యులకు ప్రమాద బీమా పరిహారం అందించేందుకు వీలు పడుతుంది. వాహనదారులు తప్పనిసరిగా వాహనానికి సంబంధించిన అన్ని అనుమతుల పత్రాలను కల్గి ఉండాలి. ద్విచక్ర వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, వాహన బీమా పత్రాలు, హెల్మెట్ లేకపోయినా జరిమానా విధిస్తున్నాం. ఇప్పటి దాకా గట్టు మండలంలో సుమారు 450 దాకా ఈ–చలాన్ ద్వారా జరిమానాలను విధించాం. ఎన్నికల దృష్ట్యా కర్ణాటక సరిహద్దులో ఉన్న బల్గెర దగ్గర ప్రత్యేకంగా చెక్ పాయింట్‌ను ఏర్పాటు చేశాం. రూ.50 వేలకు మించి నగదును తరలిస్తూ, పట్టుబడితే ఆ డబ్బును సీజ్ చేస్తాం. నగదుకు సంబంధించిన సరైన పత్రాలు ఉంటే తిరిగి వారికి అప్పగిస్తాం. – శ్రీనివాసులు, ఎస్ఐ, గట్టు -
మాది అభివృద్ధి యజ్ఞం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో అభివృద్ధిని ఒక యజ్ఞంలా చేస్తున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లాలన్నా.. అన్ని వర్గాలకు మంచి చేయాలన్నా టీఆర్ఎస్ను మరోసారి ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం జోగుళాంబ గద్వాల జిల్లాలోని పలు కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వచ్చిన సీఎం తొలుత రాజోలి మండలంలో జరుగుతున్న తుమ్మిళ్ల ఎత్తిపోతల పనులను పరిశీలించి అక్కడే అధికారులతో సమీక్షించారు. అనంతరం గట్టు మండలం పెంచికలపాడు వద్ద గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. తర్వాత జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ‘నడిగడ్డ ప్రగతి సభ’పేరిట ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారో ఆయన మాటల్లోనే... వాళ్లు సగం అంధకారంలో తెలంగాణను చాలా కష్టపడి సాధించుకున్నం. నేను కూడా చావు నోట్ల తలపెట్టి సాధించుకున్న రాష్ట్రం ఇది. గతంలో తెలంగాణ ప్రాజెక్టులు, ప్రజల సమస్యలంటే ఇతర రాజకీయ పార్టీలకు రాజకీయం. కానీ నేడు టీఆర్ఎస్ అలా కాదు. ఇదో యజ్ఞం. ఇదో పెద్ద టాస్కు.. చాలెంజింగ్‌గా తీసుకుని అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నం. రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీళ్లు పారే వరకు టీఆర్ఎస్ ఒక యజ్ఞంలా ప్రయత్నం చేస్తుంది. అలాగే కరెంట్ సమస్య అధిగమించినం. కరెంట్ ఇక జన్మల పోనియ్య. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి అనే ఒక వ్యక్తి కర్ర పట్టుకుని చూపించిండు. అంధకారమైపోతరన్నడు. కానీ వాళ్లే సగం అంధకారం అయ్యారు. మనం పూర్తి వెలుగులో ఉన్నం. దేశం మొత్తంలో రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే అని గర్వంగా ప్రకటిస్తున్నా. ఆ పథకాన్ని అలాగే కొనసాగిస్తం. సంక్షేమంలో మనమే నంబర్ 1 సంక్షేమ పథకాల అమలులో యావత్ దేశంలో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర సంక్షేమ పథకాల ద్వారా రూ.42 వేల కోట్ల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నం. రూ.25 వేల కోట్లతో రైతులను ఆదుకుంటున్నం. రూ.96 వేల కోట్లతో విద్యుత్ రంగాన్ని అభివృద్ధి చేసుకుంటున్నం. రూ.లక్ష కోట్లతో కోటి ఎకరాలకు సాగునీరు అందించే ఏర్పాట్లు చకచకసాగుతున్నాయి. కేంద్రంతోపాటు ఇతర రాష్ట్రాల మంత్రులు వచ్చి మన పథకాలు చూసి అభినందిస్తున్నరు. మన ఆడబిడ్డలు తలెత్తుకునే మరో అద్భుతమైన కార్యక్రమం మిషన్ భగీరథ త్వరలో పూర్తవుతుంది. చిన్నచిన్న ఉద్యోగస్తులకు మనవి చేస్తున్నా.. టీఆర్ఎస్ను గెలిపించండి. ఆశీర్వదించండి. భవిష్యత్తులో మరింత మంచి జరుగుతది. అలాగే రాష్ట్రం మొత్తంలో ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ పాఠశాలలు అద్భుత ఫలితాలు ఇస్తున్నాయి. ఒక్కో విద్యార్థి కోసం రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తున్నాం. 584 మండలాలు ఉన్నాయి. ప్రతీ మండలానికి బీసీ రెసిడెన్షియల్ రావాల్సి ఉంది. అందుకే రాష్ట్రంలో మరో 119 బీసీ రెసిడెన్షియల్స్ మంజూరు చేస్తున్నాం. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభిస్తాం. వీటిపై వెంటనే కేబినెట్ సమావేశం నిర్వహించి అనుమతులు మంజూరు చేస్తాం. అప్పుడే బంగారు తెలంగాణ.. నేను కూడా రైతునే. మేలో మంచిగ రెండు వానలు పడితే 60 ఎకరాలలో మక్కజొన్న పంట వేసిన. ప్రతీ రెండ్రోజులకు ఒక్కసారి ఫోన్ చేసి అడుగుత. వ్యవసాయంలో ఎన్ని కష్టాలు ఉంటయో నాకు తెలుసు. వ్యవసాయంలో ముందు దోపిడీ బంద్ కావాలి. రైతులకు నేను పెట్టుబడి ఇచ్చిన. కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నరు. భూస్వాములకు ఇచ్చినవంటున్నరు. తెలంగాణలో భూస్వాములు ఉన్నరా? ల్యాండ్ సీలింగ్ పెట్టినం. 54 ఎకరాలకు మించి లేకపాయే. ఇక భూస్వాములు ఎక్కడున్నరు? వాళ్ల పిచ్చి మాటలు కాకపోతే! అలాగే రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పక్కాగా ఉండేలా పాసు పుస్తకాలు అందజేస్తున్నం. పట్టాదారు పాసు పుస్తకంలో ఖాస్తుదారు పేరు ఎత్తేసి.. రైతు పేరు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకున్నాం. హైదరాబాద్‌లో రూ.కోట్లు పెట్టి పెద్ద పెద్ద బంగ్లాలు కడతరు. వాటిల్లో కిరాయికి ఇస్తరు. వాటిల్లో కూడా అనుభవదారు పేరు రాద్దామా? రైతు ఏమైన అగ్గువ దొరికిండా? ప్రాణం పోయిన సరే.. పెట్టుబడి పథకం పట్టాదారు రైతుకే ఇస్తం. ఇలా మొత్తంగా రైతుల అప్పులు పోయి.. జేబులో రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలు ఉంటనే బంగారు తెలంగాణ సాధించినట్లు. తెలంగాణకు వచ్చి నేర్చుకోవాలే.. రాష్ట్రంలో నాలుగు లక్షల టన్నుల గోదాముల మాత్రమే ఉండే. ఈ నాలుగేళ్లలో 23 లక్షల టన్నుల నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకున్నం. రాబోయే రోజుల్లో గ్రామ గోడౌన్లను నిర్మించే ఆలోచన చేస్తున్నం. ఏ ఊరి గోదాము ఆ ఊరిలో ఉంటే.. ఎరువుల, ధాన్యం అన్ని పెట్టుకునే పరిస్థితి ఉంటది. రైతు సమన్వయ సమితి ద్వారా రైతులకు దిశానిర్దేశం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. అందరూ ఒకేసారి ఒకే పంట వేయడం వల్ల ధరలు పడిపోతున్నాయి. అందుకే మార్కెట్లో ఉండే ధరలను రాబట్టుకోవాలి. అందుకు వచ్చే ఏడాది నుంచి సలహాలు, సూచనలు అందజేసే వెసులుబాటు కలుగుతుంది. వాతావరణానికి తగ్గట్లు పంటలు, భూముల వివరాలు, నీటి లభ్యత వంటి వాటిని తెలియజేసే ‘ఆగ్రో క్‌లెమైట్ కండిషన్’’అందుబాటులోకి వస్తుంది. శాస్త్రవేత్తల పరిశోధనలు పూర్తికాగానే రాష్ట్రమంతా పంట కాలనీలను విభజించి మనం పండించే ప్రతీ గింజ డిమాండ్‌కు అనుగుణంగా సాగు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తాం. దేశంలో మిగతా 28 రాష్ట్రాల రైతులు తెలంగాణకు పోయి నేర్చుకోవాలనే విధంగా పద్ధతులను తయారు చేస్తున్నం. కరెంట్, పెట్టుబడి, గిట్టుబాటు ధర రాబట్టే విషయంలో గొప్పగా చేసుకోబోతున్నాం. కాంగ్రెస్–టీడీపీ జట్టా.. సిగ్గుసిగ్గు?: హరీశ్‌రావు సమైక్య పాలనలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని, ముఖ్యంగా పాలమూరు ప్రాంతానికి చేసిన నష్టం అంతా ఇంతా మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ఈ ప్రాంతాన్ని చంద్రబాబు దత్తత తీసుకొని ఏమీ చేయకపోగా... ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు లేఖలు రాస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో ఎన్టీఆర్ మద్రాసులో కొన్నాళ్లు ఉన్నాననే విశ్వాసంతో తెలుగు గంగ చేపట్టారన్నారు. చంద్రబాబు మాత్రం దత్తత తీసుకున్న జిల్లా అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. అలాంటి చంద్రబాబుతో కాంగ్రెస్ నిస్సిగ్గుగా జతకడతామని చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఒక సోషల్ ఇంజనీరుగా అవతారమెత్తి కాళేశ్వరంతో పాటు ఇతర ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తున్నారన్నారు. గోదావరి జలాలను ఉత్తర తెలంగాణతో పాటు ఖమ్మం జిల్లా, ప్రస్తుత యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలకు కూడా అందజేస్తామని వెల్లడించారు. కృష్ణా జలాలను ఉమ్మడి పాలమూరు జిల్లా, రంగారెడ్డి, నల్లగొండలో మిగిలిపోయిన భాగానికి అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సి.నిరంజన్‌రెడ్డి, ఎంపీ కె.కేశవరావు, ఎమ్మెల్సీలు కె.దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఎస్.రాజేందర్‌రెడ్డి, గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్‌రెడ్డి, అంజయ్య యాదవ్‌తో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. తుమ్మిళ్ల డిజైన్లపై సీఎం సీరియస్ ఆర్డీఎస్ చివరి ఆయకట్టు వరకు నీరందించే తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం డిజైన్ల విషయంలో సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల పురోగతిపై ఆరా తీసిన ఆయన డిజైన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తుంగభద్ర నుంచి నీటిని పంపింగ్ చేసే అప్రోచ్ చానల్ ఏర్పాటు సరిగా లేదన్నారు. నది చివరి నుంచి అప్రోచ్ చానల్ ఏర్పాటు చేయడం వల్ల ఆశించిన మేర నీరు తీసుకోలేమని, తద్వారా చివరి ఆయకట్టు వరకు ఎలా నీరు అందిస్తామని అధికారులను ప్రశ్నించారు. ప్రాజెక్టు డిజైన్ రూపకల్పన విషయంలో ఈఎన్సీ మురళీధర్‌రావు, సీఈ తీరుపై మండిపడ్డారు. ఇలా చేస్తే ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. తుమ్మిళ్ల డిజైన్ మార్పు వల్ల రూ.4 కోట్ల పనులు వృథా అయినా ఫర్వాలేదని రైతులకు లబ్ధి జరగడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. తుమ్మిళ్లకు నీటి లభ్యతను పెంపొందించడం కోసం ఎగువన మరో అప్రోచ్ చానల్ నిర్మించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అయితే ఎగువన అప్రోచ్ చానల్ నిర్మించడానికి నదిలో సిల్టు ఎక్కువగా ఉందని అధికారులు సీఎంకు వివరించారు. దీనికి కేసీఆర్ స్పందిస్తూ.. ‘అయినా ఫర్వాలేదు... ప్రాజెక్టులు మళ్లీ మళ్లీ నిర్మించలేం.. ఈ డిజైన్ ఎట్టి పరిస్థితిలో మార్చాల్సిందే. ఆర్డీఎస్ రైతాంగానికి న్యాయం జరగాలి. అలాగే రిజర్వాయర్ల కెపాసిటీని కూడా కాస్త పెంచండి’అని ఆదేశాలు జారీ చేశారు. -
ఘనంగా గట్టు జన్మదిన వేడుకలు
నల్లగొండ టూటౌన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి జన్మదినం సందర్భంగా గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆపార్టీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచి పెట్టారు. ఈ సందర్భంగా మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండి. ఫయాజ్, పార్టీ జిల్లా నాయకుడు మేడిశెట్టి యాదయ్య మాట్లాడుతూ పార్టీ బలోపేతం చేసేందుకు శ్రీకాంత్‌రెడ్డి ఎంతో కృషి చేస్తున్నాడన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎండి. అజారొద్దీన్, ఎండి. రియాజొద్దీన్, జాని, ఎండి. రషీద్, పైయెద్ బేగం, అఫాన్, షాదప్, భరత్, అనిల్‌కుమార్, రఫి, అయితరాజు రాజు తదితరులు పాల్గొన్నారు. -
సెల్ చార్జింగ్ పెడుతూ యువకుడు మృతి
గట్టు (మహబూబ్‌నగర్) : సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ.. విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతిచెందిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలం తారాపురం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కావలి ఆంజనేయులు(28) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో శనివారం సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టడానికి ప్రయత్నిస్తూ.. విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళ దారుణ హత్య
గట్టు (మహబూబ్‌నగర్) : ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలం బల్లెర సమీపంలో శనివారం వెలుగు చూసింది. గ్రామ శివారులో ఓ మహిళ మృతదేహం పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అత్యాచారం చేసి హత్య చేశారా లేక పాతకక్షలతో హత్య చేశారా అనే కోణంలో దృష్టి సారించారు. -
'ఫలితాల తర్వాత టీడీపీ కనుమరుగు'
-
ఓటమిని అంగీకరించలేకనే...
-
తెలంగాణాలో కింగ్ మేకర్‌గా వైసీపీ: గట్టు
-
'పొత్తుల ఆటలు.. బాబు డ్రామాలో భాగమే'
-
'ప్రజాభీష్టం మేరకే వైఎస్సార్సీపీ మానిఫెస్టో'
-
'అంతరించే పార్టీకి అధ్యక్షుడు చంద్రబాబు'
-
'చరిత్ర హీనురాలు సోనియా'
-
అసెంబ్లీ సాక్షిగా అసలు సిసలు డ్రామా
-
'కాంగ్రెస్ రెండు నివేదికలతో డ్రామాలాడుతోంది'
-
నిర్భయ తీర్పును స్వాగతించిన వైఎస్ఆర్సిపి
-
గట్టు రామచంద్రరావు మీడియా సమావేశం 21st Aug 2013
-
గట్టురామచంద్రరావు మీడియా సమావేశం 27th JUly
-
మీడియా అత్యుత్సాహంపై మండిపడ్డ గట్టు