కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం చేశాక రాష్ట్ర విభజనపై అధికార కాంగ్రెస్ పార్టీ రెండు నివేదికలు ఎలా ఇస్తోందని గట్టు రామచంద్రరావు ప్రశ్నించారు. దీంతో కాంగ్రెస్ కుట్ర తారా స్థాయికి చేరిందన్న విషయం బహిర్గతం అయ్యిందన్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ ఆడుతున్న నాటకాన్ని ఎండగడుతూ గట్టు గురువారం మీడియాతో మాట్లాడారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి లోపల విభజనకు సహకరిస్తూ బయట సమైక్య డ్రామాను ఆసక్తికరంగా రక్తికట్టిస్తున్నారని మండిపడ్డారు. కిరణ్ అధిష్టానాన్ని ధిక్కరించినట్లు లీకులు చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నరన్నారు. అధిష్టానమే సమైక్య నివేదిక ఇమ్మందని మంత్రి వట్టి వసంతకుమార్ చెబుతుండటంలో మరోసారి కాంగ్రెస్ నాటకం బయటపడిందన్నారు. గతంలో ఉత్తర ప్రదేశ్ ని నాలుగు రాష్ట్రాలుగా చేయమని చెబితే తీర్మానం ఎందుకు చేయలేదని గట్టు అధిష్టానాన్ని నిలదీశారు.ఒక్క తెలుగు జాతిపైనే కాంగ్రెస్ ఒంటెద్దు పోకడలను ప్రదర్శిస్తోందన్నారు.తెలుగు ప్రజలపై అధిష్టానానికి కాంగ్రెస్ కు ఎందుకంత కక్షని గట్టు ప్రశ్నించారు.
Published Thu, Nov 14 2013 4:51 PM | Last Updated on Thu, Mar 21 2024 6:35 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement