ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలం బల్లెర సమీపంలో శనివారం వెలుగు చూసింది.
గట్టు (మహబూబ్‌నగర్) : ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలం బల్లెర సమీపంలో శనివారం వెలుగు చూసింది. గ్రామ శివారులో ఓ మహిళ మృతదేహం పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అత్యాచారం చేసి హత్య చేశారా లేక పాతకక్షలతో హత్య చేశారా అనే కోణంలో దృష్టి సారించారు.