సాక్షి, చెన్నై: ఓ వివాహిత గురువారం తెల్లవారుజామున దారుణహత్యకు గురైంది. ఆమె భర్త తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన చెన్నైలోని వడపళనిలో చోటుచేసుకుంది. ముఖానికి ముసుగుతో వచ్చిన కొంతమంది ఈఈ అగాయిత్యానికి పాల్పడినట్లు దర్యాప్తు తేలింది. వివరాలివి.. కాంచీపురం నగరానికి చెందిన బాలగణేష్(27) ఐదేళ్ల క్రితం జ్ఞానప్రియ(24) అనే యువతిని ప్రేమించి పెద్దల సమ్మతితో వివాహం చేసుకున్నాడు. పెళ్లి అనంతరం చెన్నైలోని వడపళనిలోని శివాలయం ఓ పూజారిగా పనిలో చేరాడు.
గుడి సమీపంలో ఓ అద్దె ఇంటిలో వారు జీనవం సాగిస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులు ఇచ్చే కానుకలతో కాపురాన్ని నెట్టుకొస్తున్నాడు. రోజు మాదిరిగానే బుధవారం రాత్రి విధులు ముగించుకుని బాలగణేష్ ఇంటికి చేరుకున్నాడు. కానీ గురువారం ఉదయం 6 గంటలకు ఇంటి యాజమాని విజయలక్ష్మి బయటకు వచ్చింది. ఆ సమయంలో ఆమె కాళ్లు, చేతులూ కట్టిపడేసి తీవ్ర గాయాలతో ఉన్న బాలగణేశ్ ఆమె చూసింది.
దీంతో భయాందోళనకు గురైనా ఆమె అతని భార్యకు విషయం చెప్పడానికి ఇంట్లోకి చూసింది. ఆ సమయంలో రక్తపు మడుగులో ఉన్న జ్ఞానప్రియ ఆమెకు కనిపించింది. ఇంటి యాజమాని, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు 108 అంబులెన్స్‌తో అక్కడి చేరుకుని తీవ్ర గాయాలైనా దంపతులను ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే జ్ఞానప్రియ చనిపోయినట్లు తేలడంతో డాక్టర్లు మృతదేహాన్ని పోస్టుమార్టనికి పంపించారు.
తీవ్రగాయాలైనా బాలగణేష్‌ను చికిత్స నిమిత్తం చెన్నై రాయపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దంపతుల ఇంటి బీరువాలోని బంగారు నగలు, జ్ఞానప్రియ మెడలోని తాళిబొట్టు కూడా కనిపంచలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దుండగులను గుర్తించడానికి జాగిలంతో పాటూ వేలిముద్రల సేకరణ కోసం ఫోరెన్సిక్ నిపుణులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే గురువారం తెల్లవారుజామున ముఖానికి ముసుగులు ధరించిన వ్యక్తులు ఇంటిలోకి జొరబడి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాధమిక విచారణలో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment