తల్లిని హతమార్చి.. తలను పట్టుకెళ్లి..  | Son Brutally Murdered His Mother in chennai | Sakshi
Sakshi News home page

తల్లిని హతమార్చి.. తలను పట్టుకెళ్లి.. 

Published Mon, Mar 19 2018 4:06 AM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM

Son Brutally Murdered His Mother in chennai - Sakshi

టీ.నగర్‌ (చెన్నై): ఆస్తి కోసం కన్న తల్లిని హతమార్చాడో ప్రబుద్ధుడు. తల్లి తలను తెగనరికి తలతో పాటు పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ అమానవీయ ఘటన తమిళనాడు పుదుక్కోట్టై జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. కరంబకుడి సమీపాన మరవంబట్టి గ్రామానికి చెందిన తంగరాజ్‌ ఏడేళ్ల క్రితం మృతిచెందాడు. అతనికి భార్య తిలగరాణి(48), ఐదుగురు కుమారులున్నారు. పెద్ద కుమారుడు ఆనంద్‌(23) ఆస్తి పంచివ్వాలంటూ తల్లితో తరచూ తగాదాకు దిగేవాడు. 

ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం రాణికి, ఆనంద్‌కు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ గొడవలో ఆనంద్‌ కత్తితో తల్లి రాణి తల తెగనరికాడు. తల్లి తలను బైక్‌లో పట్టుకెళ్లి కరంబకుడి పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement