
ప్రతీకాత్మక చిత్రం
చెన్నై : పోలీసుల అరెస్ట్ నుంచి తప్పించుకోవటానికి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుందో మహిళ. ఈ సంఘటన తమిళనాడులోని చెన్నైలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఒడైకుప్పానికి చెందిన ఉషా ఆమె భర్త రత్నం గత కొన్నేళ్లుగా అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారు. వీరిద్దరిపై డజన్‌కు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం పోలీసులు వారిని అరెస్ట్ చేయటానికి ఒడైకుప్పంలోని ఇంటికి వెళ్లారు. విషయం తెలుసుకున్న ఉషా.. పోలీసులనుంచి తప్పించుకోవటానికి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. (ప్రేమికుల కిడ్నాప్.. సినిమాను తలపించేలా)
అలర్ట్ అయిన పోలీసులు వెంటనే ఆమెను గోనె సంచుల్తో చుట్టి, నీళ్లు చల్లారు. అనంతరం కిల్పాక్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌కు తరలించారు. ఇంటినుంచి 37 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. 50 శాతం కాలినగాయాలతో ఉన్న ఉషా పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో కొంతమంది పోలీసులు కూడా గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment