భయపెట్టే జాబాలి | Jabali Movie Audio Launched | Sakshi
Sakshi News home page

భయపెట్టే జాబాలి

May 8 2014 10:38 PM | Updated on Jul 12 2019 4:40 PM

భయపెట్టే జాబాలి - Sakshi

భయపెట్టే జాబాలి

‘‘అడవిలో హారర్ నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన తెలుగు సినిమా ఇది. గ్రాఫిక్స్ ప్రధానాకర్షణగా నిలుస్తుంది’’ అని దర్శకుడు హేమరాజ్ చెప్పారు.

 ‘‘అడవిలో హారర్ నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన తెలుగు సినిమా ఇది. గ్రాఫిక్స్ ప్రధానాకర్షణగా నిలుస్తుంది’’ అని దర్శకుడు హేమరాజ్ చెప్పారు. ఎం.అరుణ్, షరిష్ట, అనన్య త్యాగి ముఖ్య తారలుగా జె.ఆర్.ఇ. గ్రూప్ పతాకంపై టి.జయచంద్ర నిర్మించిన ‘జాబాలి’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. సీనియర్ దర్శకుడు పీయన్ రామచంద్రరావు పాటల సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని నిర్మాత ప్రసన్న కుమార్‌కి అందించారు. పీఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ -‘‘ఈ చిత్ర దర్శకుడు నా శిష్యుడు. సినిమా మేకింగ్‌పై విపరీతమైన ప్రేమానురాగాలు ఉన్నాయి తనకు. ఈ సినిమా తనకు మంచి పేరు తేవాలి’’ అన్నారు. తమ సంస్థలో ఇది తొలి చిత్రమని, అందరికీ నచ్చుతుందని నిర్మాత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వినోద్, సురేష్ కొండేటి, సాయి వెంకట్, రామసత్యనారాయణ తదితరులు మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement