సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో బీజేపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావును ఉన్నతాధికారులు టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధిగా పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లో మాత్రం ఆయనను బీజేపీ ఎమ్మెల్సీ అని అధికారికంగా పేర్కొన్నా రు. సిబ్బంది, ఉన్నతాధికారుల నిర్లక్ష్యం ఇలా బయటపడింది.
కేరళ వరద బాధితులకు రాష్ట్రం లోని 34 మంది ఎమ్మెల్సీలు నెల వేతనాన్ని విరా ళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఎమ్మెల్సీల తరఫున సీఎం కేసీఆర్‌కు శుక్రవారం అంగీకారపత్రం ఇచ్చారు. దీని ప్రకారం ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి శివశంకర్ శనివారం ఉత్త ర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులో 34 మంది ఎమ్మెల్సీ పేర్లను వరుసగా పొందుపరిచింది. జాబితాలో చివరలో ఎన్.రాంచందర్‌రావు పేరు పక్కన టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అని పేర్కొన్నారు.
ఐపీఎస్ అధికారుల విరాళం
కేరళలో సహాయ, పునరావాస చర్యల కోసం రాష్ట్రంలోని ఐపీఎస్, పోలీసు శాఖ అధికారులు, సిబ్బంది ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చా రు. ఈ విరాళాన్ని కేరళ సహాయ నిధి కోసం కేటాయిస్తూ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి(ఎఫ్‌పీ) ఎన్.శివశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment