హీరోగా రాబోతున్న డైరెక్టర్‌ కుమారుడు తేజ్‌ | Naga Chaitanya Launches Sai Ratna Creations Production No 2 | Sakshi
Sakshi News home page

Naga Chaitanya: నాగచైతన్య చేతుల మీదుగా ప్రారంభమైన మూవీ

Published Thu, Jun 9 2022 7:32 PM | Last Updated on Thu, Jun 9 2022 7:32 PM

Naga Chaitanya Launches Sai Ratna Creations Production No 2 - Sakshi

తేజ్ బొమ్మ దేవర, రిషిక లోక్రే జంటగా  బొమ్మ దేవర రామచంద్ర రావు దర్శక, నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ప్రొడక్షన్ నెంబర్ 2. ఈ మూవీ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన నాగ చైతన్య  హీరో, హీరోయిన్‌లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా..ఆర్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ రాజు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. స్క్రిప్ట్ ఏ.సి.యస్ కిరణ్ అందించారు. దర్శకుడు సముద్ర గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శక, నిర్మాత బొమ్మ దేవర రామచంద్ర రావు మాట్లాడుతూ.. మేము పిలవగానే వచ్చిన హీరో నాగ చైతన్య కు, సి కళ్యాణ్, సముద్ర గార్లకు, నాకు ఈ సినిమా చేసే అవకాశం కల్పించిన నాగార్జున గారికి ధన్యవాదాలు. ఇప్పటి వరకు వచ్చిన ప్రేమకథలకు భిన్నంగా ఈ కథ ఉంటుంది. ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్న మా అబ్బాయిని మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఈ నెల 10 నుంచి 21వ తేదీ వరకు మొదటి షెడ్యూల్ చేసుకుని జులై ఫస్ట్ నుంచి అరకులో మిగిలిన షూటింగ్ జరుపుకుని సెప్టెంబర్‌లో షూటింగ్ పూర్తి  చేసుకొని అదే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం అన్నారు.

చిత్ర హీరో తేజ్  మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి సినిమా అంటే ప్యాషన్. మా నాన్న గారు నన్ను ఫోర్స్ చేయలేదు. నాకు ఏది ఇష్టమో అది చేయమన్నారు. నాకు నటనపై ఆసక్తి ఉండడంతో సినిమాకు కావాల్సిన యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అన్ని నేర్చుకొని నా ఇంట్రెస్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. ఇప్పటి వరకు వచ్చిన ప్రేమకథలకు భిన్నమైన చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు. నేను చేస్తున్న ఈ మొదటి చిత్రాన్ని ప్రేక్షకులు అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

చదవండి: బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌లోకి హర్ష సాయి?
సినిమాల్లోకి రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన నమ్రత

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement