ప్రజలు తమలోని భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించగలినప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని అమెరికన్ కాన్సుల్ జనరల్ మైఖేల్ ముల్లిన్స్ వ్యాఖ్యానించారు
- అమెరికన్ కాన్సులేట్ జనరల్ మైఖేల్ ముల్లిన్స్
- ఐజేయూ ఆధ్వర్యంలో విస్తరిస్తున్న మీడియా- జర్నలిస్టుల నైతిక విలువలపై చర్చ
హైదరాబాద్
ప్రజలు తమలోని భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించగలినప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని, అలాంటి వాతావరణ మీడియా ద్వారానే సాధ్యమవుతుందని అమెరికన్ కాన్సుల్ జనరల్ మైఖేల్ ముల్లిన్స్ వ్యాఖ్యానించారు. మీడియా చైతన్యం లేకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు.
అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ సందర్భంగా గురువారమిక్కడ ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (ఐజేయూ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విస్తరిస్తున్న మీడియా- జర్నలిస్టుల నైతిక విలువలు’ అనే అంశంపై చర్చ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అమెరికన్ కాన్సుల్ జనరల్ మైఖేల్ ముల్లిన్స్, ముఖ్య అథితిగా పాల్గొని ప్రసంగించారు.