
ప్రముఖ న్యాయవాది ఎస్ రామచంద్రరావు గురువారం కన్నుమూశారు.
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ న్యాయవాది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వొకేట్ జనరల్ ఎస్ రామచంద్రరావు గురువారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండె నొప్పితో నేడు తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎన్నో సంచలన కేసులను ఆయన వాదించారు. రామచంద్రరావు మరణం పట్ల వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం తెలిపారు.