సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఆపార్టీ బీసీ విభాగం రాష్ట్ర కన్వీనర్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు స్పష్టం చేశారు.
ఒకటే మాట.. ఒకటే బాట
Published Sun, Jan 5 2014 3:16 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
నకరికల్లు, న్యూస్‌లైన్ :సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఆపార్టీ బీసీ విభాగం రాష్ట్ర కన్వీనర్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు స్పష్టం చేశారు. అదిలాబాద్ నుంచి అనంతపురం వరకు, ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ఒకే మాటపై నిలిచిందన్నారు. తమ పార్టీ గుర్తు ఫ్యానులోని మూడు రెక్కలు ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలకు చిహ్నాలుగా పేర్కొన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లులో శనివారం రాత్రి సమై క్య శంఖారావం బహిరంగ సభ నిర్వహిం చారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాబాబు అధ్యక్షతన జరిగిన సభ లో రామచంద్రరావు ముఖ్య అతిథిగా మాట్లాడారు. రాష్ర్ట విభజన అంటే ఇటలీ బన్ను ముక్క కాదన్నారు. రాష్ట్రాన్ని ము క్కలు చేయడానికి పల్నాటి పౌరుషం, రాయలసీమ రౌద్రం అంగీకరించవన్నారు
నాది వేరు తెలంగాణ కాదు..
తనది వీర తెలంగాణనే కాని వేరు తెలంగాణ కాదని, అభివృద్ధి కోరుకుంటాం కాని ముక్కలు చేస్తానంటే ఊరుకోబోమని గట్టు స్పష్టం చేశారు. ప్రస్తుతం విభజన బస్సు అసెంబ్లీలో ఆగి ఉందని ఈనెల 23 నాటికి డిల్లీ పార్లమెంట్‌కు చేరుకుంటుందన్నారు. ఈలోగా విభజనకు వ్యతిరేకంగా తీర్మానం చేయాల్సింది పోయి బస్సులో చాయ్ తాగుతూ కాలక్షేపం చేస్తే బస్సు పార్లమెంట్‌కు చేరుకునే అవకాశం ఉందని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యన్నారాయణ సమైక్యాంధ్ర కోరుకుంటున్నానని చెబుతున్నారని, పోరాడాల్సింది పోయి కోరుకోవడమేమిటని గట్టు ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి కోడెలకు తెలుగువారిపై ప్రేమ ఉంటే చంద్రబాబుతో సమైక్య తీర్మానం కోసం పట్టుబట్టాలన్నారు.
విడిపోతే సంస్కృతి విచ్ఛిన్నమే..
ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ జనక్‌ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే ఐదువేల సంవత్సరాల సంస్కృతి విచ్ఛిన్నమవుతుందన్నారు. కుమారుడు రాహుల్‌ను ప్రధానిని చేయడం కోసం రాజ్యాంగస్పూర్తికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని చీల్చడానికి సోనియా కుట్రపన్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్ సోనియాగాంధీ తాబేదారుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ర్టంలో పయ్యావులకేశవ్, కోడెల శివప్రసాదరావులు ఇక్కడ సమైక్యమంటున్నారని దమ్ముంటే చంద్రబాబు చేత తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను ఉపసంహరింపజేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విచ్ఛిన్నంలో మొదటి ముద్దాయి కాంగ్రెస్, రెండో ముద్దాయి టీడీపీ అని చెప్పారు. రాష్ట్ర సమైక్యంగా ఉండటం కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొబెట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పార్టీ రాష్ట్రనేత శివకుమార్ మాట్లాడుతూ వైఎస్ జగన్ విజన్ ఉన్న నాయకుడని కొనియాడారు. రాష్ట్ర విభజన జరిగితే నష్టపోయేది తెలంగాణే అని చెప్పారు.
చంద్రబాబు, కిరణ్ నకిలీ సమైక్యవాదులు..
అంబటి రాంబాబు మాట్లాడుతూ దేశంలో అతిపెద్ద అనకొండ చంద్రబాబేని విమర్శించారు. ఎన్టీఆర్ నాడు చంద్రబాబు అనే చిన్నపామును తెచ్చిపెంచితే అది ఎన్టీఆర్‌ను, ఆయన కుటుంబాన్ని మింగిందన్నారు. తెలంగాణ, సీమాంధ్ర నాయకులను ఒకే వేదికపై కూర్చొబెట్టి సమైక్యాంధ్రకు జై కొట్టే దమ్ము చంద్రబాబు ఉందా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి, చంద్రబాబు నకిలీ సమైక్య వాదులని విమర్శించారు. గురజాల నియోజకవర్గ సమన్వయకర్త జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే భావితరాలకు తీరని నష్టం వాటిల్లుతుందన్నారు. జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ చంద్రబాబు పక్కా విభజన వాదని విమర్శించారు.
సమైక్య ముసుగులో టీడీపీ విభజన కోరుకుంటోందని ఆరోపించారు. కార్యక్రమంలో వేమూరు, నరసరావుపేట, నియోజకవర్గ సమన్వయకర్తలు మేరుగ నాగార్జున, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పార్టీ అనుబంధ విభాగాల జిల్లా కన్వీనర్‌లు సయ్యద్ మహబూబ్, దేవళ్ల రేవతి. బండారు సాయిబాబు. మేరావత్ హనుమంతునాయక్, ఉత్తమ కుమార్‌రెడ్డి, కోడిరెక్క దేవదాసు, కొత్తా చిన్నపరెడ్డి, మామిడి రాము, బిలాల్ కరీం, దూదేకుల మీరావలి, నాయకులు ఆరిమండ వరప్రసాదరెడ్డి, పార్టీ మండల కన్వీనర్‌లు మేడికొండ ప్రకాశరెడ్డి(నకరికల్లు) తోట ప్రభాకర్(రాజుపాలెం) మదమంచి రాంబాబు (సత్తెనపల్లి రూరల్) గార్లపాటిప్రభాకర్(సత్తెనపల్లి టౌన్), రెండెద్దుల వెంకటేశ్వరరెడ్డి(ముప్పాళ్ల) తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement