సుదీర్ఘమైన చర్చలు, తీవ్ర నిరసనలు, వాదోపవాదాలు, సవరణలకు డిమాండ్ల మధ్య పౌరసత్వ సవరణ బిల్లుకి 311–80 ఓట్ల తేడాతో లోక్‌సభ ఆమోద ముద్ర వేసింది కానీ, పెద్దల సభలో ఏం జరుగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది.
పొరుగు దేశాల్లో ఉన్న ముస్లిమేతరులకు భారత్ పౌరసత్వాన్నిచ్చే పౌరసత్వ సవరణ బిల్లు (సీఏబీ) బుధవారం ఎగువ సభలో ప్రవేశపెడుతున్నట్టు రాజ్యసభ వర్గాలు వెల్లడించాయి. ఈ బిల్లుపై చర్చకు 6 గంటలు కేటాయించినట్టు తెలుస్తోంది.