సాక్షి, న్యూఢిల్లీ: ‘నేను ఓ ముస్లింను. క్యాప్‌బిల్ (పౌరసత్వ సవరణ చట్టం)కు నేను సంపూర్ణంగా మద్దతిస్తున్నాను. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నా ముస్లిం సోదరులు చేస్తున్న ఆందోళనను అంతే బలంగా ఖండిస్తున్నాను. వారు బిల్లును సరిగ్గా అర్థమైన చేసుకొని ఉండరు లేదా రాజకీయ చర్యలో భాగంగా ఉద్దేశపూర్వకంగానే బిల్లును వ్యతిరేకిస్తూ ఉండాలి. నేను మాత్రం బిల్లును సమర్థిస్తున్నందుకు గర్వపడుతున్నాను. జైహింద్’ ఓ ముస్లిం మహిళ పేరిట ఇటీవల ఓ ట్వీట్ వచ్చింది. ఇదే సరళలు పలువురు యువతీ యువకులు ముస్లింల పేరిట వరుసగా ట్వీట్లు చేశారు.
ఇలా ట్వీట్లు చేసిన వారి ప్రొఫైల్స్‌ను ‘ఆల్ట్ న్యూస్’ వెతికి పట్టుకోగా వారిలో 99 శాతం మంది హిందువులని, వారు గతంలో తాము హిందువులం అంటూ చేసిన ట్వీట్లు కూడా దొరికాయి. చివరలో ‘నేను ఓ ముస్లింను, చివరలో జై హింద్’ అంటూ ట్వీట్ చేసిన యువతి పేరు ఆర్తిపాల్‌గా తేలింది. ఆర్తిపాల్ చేసిన ట్వీట్‌కు 500 రీట్వీట్లు వెళ్లాయి. అలాగే గతంలో హిందువునని చెప్పుకున్న అర్పిత గౌతమ్ ఇప్పుడు ఖదీజా పేరిట ముస్లింనంటూ రీట్వీట్ చేశారు.
‘నేను ఒక హిందువును. హిందువు, క్రైస్తవులు, ముస్లింల పట్ల నాకు భేద భావం లేదు. వారు మాత్రం హిందువులను బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారు’ అంటూ గత ఏప్రిల్ 16వ తేదీన ‘బాషా భాయ్’ పేరిట ట్వీట్ చేసిన వ్యక్తి ఈ డిసెంబర్ 14వ తేదీన అదే పేరుతో ‘నేను ఓ ముస్లింను. పౌరసత్వ సవరణ బిల్లును సమర్థిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. ‘నీచే సే టాపర్’ శీర్షికతో ‘నేనొక ముస్లింను, పౌరసత్వ బిల్లుకు సంపూర్ణ మద్దతిస్తున్నాను’ అంటూ డిసెంబర్ 14వ తేదీన ట్వీట్ చేసిన వ్యక్తి గతంలో ఏప్రిల్ 26వ తేదీన ‘నేనొక హిందువును’ అంటూ ట్వీట్ చేశారు. మిగతా పలు ట్వీట్లు కూడా ఇదే కోవకు చెందినవి.
Comments
Please login to add a commentAdd a comment