![Congress stoking violence against Citizenship Act - Sakshi](/styles/webp/s3/article_images/2019/12/15/Untitled-16.jpg.webp?itok=F3xTgWcd)
గిరిధ్ బాఘ్మారా: పౌరసత్వ సవరణ చట్టం గురించి కాంగ్రెస్ ప్రజలను రెచ్చగొడుతోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా చెప్పారు. శనివారం ఆయన జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తాము తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం కాంగ్రెస్‌కు కడుపునొప్పి తెప్పించిందని, అందుకే ఆ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రజలను రెచ్చగొడుతోందని అన్నారు. రాహుల్ గాంధీ జార్ఖండ్‌ను ఇటాలియన్ కళ్లజోడుతో చూస్తున్నారని, అందుకే అభివృద్ధి కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. బీజేపీ ముస్లింలకు వ్యతిరేకమని కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని, అయితే వారికి మద్దతుగా ట్రిపుల్ తలాక్ చట్టం తెచ్చిన ఘనత ఎన్డీయేదేనని స్పష్టంచేశారు. డిసెంబర్ 16న జార్ఖండ్‌లో నాలుగో విడత ఎన్నికలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment