మరో వివాదాస్పద బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఆర్టికల్ 370 రద్దు అనంతరం, ఆ స్థాయిలో విమర్శలు, నిరసనలు ఎదుర్కొన్న పౌరసత్వ (సవరణ) బిల్లు బుధవారం రాజ్యసభ అడ్డంకిని విజయవంతంగా అధిగమించింది. సభలో జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 125, వ్యతిరేకంగా 99 ఓట్లు వచ్చినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ఈ బిల్లును సోమవారం లోక్‌సభ ఆమోదించింది.