ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని తట్టా నగరంలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో 10 మంది సజీవదహనమయ్యారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ప్రమాదవశాత్తూ అంటుకున్న మంటలు ఒక ఇంటి నుంచి మరొ ఇంటికి వ్యాపించాయి. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.
కాగా, ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని త్వరలో అగ్నిప్రమాదానికి గల కారణాలను గుర్తించి తెలియజేస్తామని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు.
పాకిస్తాన్లో అగ్నిప్రమాదం: 10 మంది సజీవదహనం
Published Sun, Feb 7 2016 7:21 PM | Last Updated on Sun, Sep 3 2017 5:08 PM
Advertisement
Advertisement