'మా ఆయనకు అందమైన ఆడాళ్లే ఇష్టం' | Somnath Bharti only cares about beautiful women, not average looking, says his wife | Sakshi
Sakshi News home page

'మా ఆయనకు అందమైన ఆడాళ్లే ఇష్టం'

Published Tue, Aug 4 2015 4:10 PM | Last Updated on Sun, Sep 3 2017 6:46 AM

'మా ఆయనకు అందమైన ఆడాళ్లే ఇష్టం'

'మా ఆయనకు అందమైన ఆడాళ్లే ఇష్టం'

ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి సోమ్నాథ్ భారతి వ్యాఖ్యల మీద తీవ్రస్థాయిలో దుమారం రేగింది. పోలీసు వ్యవస్థను ఢిల్లీ ప్రభుత్వానికి అప్పగిస్తే.. అందమైన మహిళలు కూడా అర్ధరాత్రి సురక్షితంగా తిరిగేలా చూడగలమన్న ఆయన వ్యాఖ్యలపై ఒకప్పటి ఆయన భార్య లిపికా మిత్ర కూడా మండిపడ్డారు. తన భర్తకు కేవలం అందమైన మహిళలంటేనే ఇష్టమని, తనలా సాధారణంగా ఉండేవాళ్లను ఆయన పట్టించుకోరని.. అందుకే తనను కూడా పట్టించుకోకుండా వదిలేశారని ఆమె అన్నారు.

ఆయన పట్ల తాను చాలా ప్రేమ చూపించేదాన్నని, కానీ ఆయన మాత్రం తనను పట్టించుకోకుండా అందమైన అమ్మాయిలనే పట్టించుకునేవారని అన్నారు. ఇప్పుడు ఆయన చేసిన ప్రకటన కూడా ఈ విషయాన్ని నిర్ధారిస్తోందన్నారు. బహుశా అందుకే ఆయన తనను కూడా వేధించి ఉంటారని ఇప్పుడు అర్థమవుతోందన్నారు. తాను సాధారణ మహిళను మాత్రమేనని, తనలా సాధారణంగా ఉండేవాళ్లను ఎవరు మాత్రం చూస్తారని.. తమకు ఈ సమాజంలో స్థానం లేదని లిపిక ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement