ఎఫ్ఐఆరే నమోదు కాలేదు.. బెయిలేంటి?
న్యూఢిల్లీ: గృహహింస చట్టం కింద నమోదైన కేసు విషయంలో ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి సోమ్నాథ్ భారతికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈ కేసు విషయంలో నిందితుడు అలా కోరడం అనుభవరాహిత్యం అని పేర్కొంది.
బెయిల్ పిటిషన్ను విచారించిన అడిషనల్ సెషన్స్ జడ్జి పరమ్ జీత్ సింగ్ అసలు ఇంతవరకు ఈ కేసు విషయంలో ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని, ఎలాంటి అరెస్టులు జరగలేదని, దరఖాస్తు కూడా పూర్తిస్థాయిలో లేదని పేర్కొన్నారు. గత జూన్లో సోమ్నాథ్ భారతి భార్య లిపికా భారతి 2010 నుంచి ఆయన గృహహింసకు పాల్పడుతున్నారని, మానసికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ కేసు పెట్టిన విషం తెలిసిందే.