ఎమ్మెల్యేపై గృహహింస కేసు, సమన్లు | AAP leader Somnath Bharti's wife alleges domestic violence, moves DCW | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేపై గృహహింస కేసు, సమన్లు

Published Wed, Jun 10 2015 6:27 PM | Last Updated on Mon, Oct 22 2018 8:54 PM

ఎమ్మెల్యేపై గృహహింస కేసు, సమన్లు - Sakshi

ఎమ్మెల్యేపై గృహహింస కేసు, సమన్లు

న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు కష్టాలు వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే ఆప్ మంత్రి నకిలీ డిగ్రీ పట్టా కేసులో జైలుకు వెళితే.. తాజాగా మరో ఆప్ ఎమ్మెల్యే చిక్కుల్లో పడ్డారు. ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతిపై ఆయన భార్య గృహహింస కేసు పెట్టారు. సోమనాథ్ భారతి తనను వేధిస్తున్నారంటూ ఆమె ఢిల్లీ మహిళా కమిషన్ను ఆశ్రయించింది.  దాంతో మహిళా కమిషన్ బుధవారం సోమనాథ్ భారతికి సమన్లు జారీ చేసింది.

కాగా గతంలోనూ సోమనాథ్పై  ఆఫ్రికన్ మహిళలపై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సోమనాథ్ భారతి తన మద్దతుదారులతో కలిసి దాడి చేశారంటూ ఉగాండా మహిళ ఫిర్యాదు చేయటంతో ఆయనపై జనవరి 19న ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement