న్యూఢిల్లీ: ఆఫ్రికన్ మహిళలపై దాడి చేసిన కేసులో ఢిల్లీ మాజీ మంత్రి సోమనాథ్ భారతిపై విచారణకు సంబంధించిన తుది నివేదికను అందజేయాలని ఢిల్లీ పోలీసులకు కోర్టు నోటీసులు జారీచేసింది. తనపై దాడి చేసిన వారిపై కేసు పెట్టాలని ఆఫ్రికన్ మహిళ ఫిర్యాదు చేసినా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. మేజిస్ట్రేట్ ముందు తన వాంగ్మూలాన్ని నమోదు చేసింది. దాంతో ఈ అంశంపై నివేదిక ఇవ్వాలంటూ జనవరి 29 మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ చేతనా సింగ్ ఢిల్లీ పోలీసు విచారణాధికారిని ఆదేశించారు. అయినా ఇంతవరకు నివేదిక ఇవ్వకపోవడంతో గ్రహించిన కోర్టు ఆగస్టు రెండు కల్లా తుది నివేదికివ్వాలని ఆదేశించింది. సోమనాథ్ భారతి తన మద్దతుదారులతో కలిసి దాడి చేసిన కేసులో మరో బాధితురాలైన ఉగాండా మహిళ ఫిర్యాదు చేసిన తరువాత జనవరి 19న వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
సోమనాథ్ భారతి కేసులోపోలీసులకు కోర్టు నోటీసులు
Published Mon, May 26 2014 10:36 PM | Last Updated on Thu, Mar 28 2019 6:23 PM
Advertisement
Advertisement