'నాపై కక్షతో నా భార్యను ఉపయోగిస్తున్నారు' | Delhi Police working in supersonic speed in domestic abuse case against me: Somnath Bharti | Sakshi
Sakshi News home page

'నాపై కక్షతో నా భార్యను ఉపయోగిస్తున్నారు'

Published Wed, Sep 16 2015 10:00 AM | Last Updated on Sun, Sep 3 2017 9:31 AM

'నాపై కక్షతో నా భార్యను ఉపయోగిస్తున్నారు'

'నాపై కక్షతో నా భార్యను ఉపయోగిస్తున్నారు'

న్యూఢిల్లీ: తన కేసు విషయంలో ఢిల్లీ పోలీసులు గాలి, శబ్ధంకంటే వేగంగా(సూపర్ సోనిక్ స్పీడ్) దూసుకెళుతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమనాథ భారతి ఆరోపించారు. వారు ప్రతి కేసులోనూ ఇదే వేగంతో పనిచేస్తే ఢిల్లీ మొత్తం నేర రహిత మహానగరంగా అనతి కాలంలోనే సాధ్యమవుతుందని అన్నారు. తనపై కేసు నమోదైనప్పటి నుంచి వారు మితిమీరిన అత్యుత్సాహంతో పనిచేస్తున్నారని దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. తనపై రాజకీయంగా కక్ష తీర్చుకోవాలని తన భార్యను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.

తనను గృహహింసకు గురిచేయడంతోపాటు హత్య చేసేందుకు కూడా ప్రయత్నించాడని సోమనాథ్ భారతిపై ఆయన భార్య కేసు పెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసును పోలీసులు గత ఐదు రోజుల కిందే నమోదు చేశారు. జూలైలోనే ఆమె ఫిర్యాదు చేసినా తొలుత వారిద్దరి మధ్య సంప్రదింపులు జరిపిన పోలీసులు ఫలితం లేకపోవడంతో చివరకు సోమనాథ్ అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కోర్టులు కూడా ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వని కారణంగా పోలీసులు అరెస్టు చేయడానికి అడ్డంగి తొలిగినట్లయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement