స్వాతి మలివాల్‌ కేసు: సీఎం నివాసంలో సీసీటీవీ ఫుటేజీ స్వాధీనం | Swati Maliwal case: Police seize CCTV footage from Kejriwals residence | Sakshi
Sakshi News home page

స్వాతి మలివాల్‌ కేసు: ఢిల్లీ పోలీసులపై ఆప్‌ ఆరోపణలు

Published Mon, May 20 2024 12:45 PM | Last Updated on Mon, May 20 2024 3:31 PM

Swati Maliwal case: Police seize CCTV footage from Kejriwals residence

ఢిల్లీ: ఆప్‌ రాజ్యసభ స్వాతి మలివాల్‌పై దాడి జరిగిన కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసంలోని సీసీటీవీ కెమెరాలకు సంబంధించి డిజిటల్‌ వీడియో రికార్డ్‌ (డీవీఆర్)లను పోలీసులు స్వాధీనం చేసకున్నారు. ఈ విషయాన్ని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆదివారం వెల్లడించింది. 

కాగా.. లోక్‌సభ ఎ‍న్నికల ముందు పార్టీ ప్రతిష్టను దెబ్బతీయాలని పోలిసులు ప్రయత్నం చేస్తున్నారని ఆప్‌ ఆరోపించింది. దర్యాప్తుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు కట్టకథలు అల్లుతోందని ఆప్‌ ఆరోపణుల చేసింది. ఇక.. ఢిల్లీ పోలీసులు నుంచి ఎటువంటి సత్వరమైన స్పందన లేదని పేర్కొంది.  

‘‘పోలీసులు శనివారమే కేజ్రీవాల్‌ నివాసంలోని సీసీటీవీ కెమెరాల డీవీఆర్‌లను స్వాధీనం చేసుకున్నారు. మళ్ల ఆదివారం కూడా సీఎం నివాసంలోని మిగతా చోట్ల ఉ‍న్న సీసీటీవీ  కెమెరాల డీవీఆర్‌ను స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ తొలగించారని పోలీసులు చెబుతున్నారు. 

కానీ, అప్పటికే పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కావాలనే వాటిపై కట్టుకథలు అల్లుతున్నారు’’ అని ఆప్‌ నేత సౌరభ్‌ భరద్వాజ్‌ అన్నారు. అదే విధంగా సీఎం నివాసంలోని సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణను పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్టుమెంట్‌ ఆధీనంలో ఉంటుందని సౌరభ్‌ భరద్వాజ్‌ తెలిపారు.

ఈ కేసుకు సంబంధించిన ఆయలు పలు ప్రశ్నలు సంధించారు. ‘‘మే 13న స్వాతి మలివాల్‌ నుంచి పోలీసులకు కాల్‌ వచ్చింది. అయితే  కొద్దిసేటికే ఈ విషయం మీడియాకు వ్యాపించింది. సెక్షన్‌ 354(బీ)కి కేసు నమోదైంది. ఓ మహిళకు సంబంధించిన  సున్నితమైన విషయం. కానీ, కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ బయటకు వచ్చింది. బిభవ్‌కుమార్‌ నిందితుడు అయితే ఆప్‌ వద్ద ఎఫ్‌ఐఆర్‌ కాపీ లేదు’ అని  సౌరభ్‌ భరద్వాజ్‌ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement