కేజ్రీవాల్, సోమనాథ్ భారతీలపై కేసులు
Published Tue, Jan 21 2014 11:30 PM | Last Updated on Sat, Sep 2 2017 2:51 AM
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కేజ్రీవాల్, న్యాయశాఖ మంత్రి సోమనాథ్ భారతీల ఎన్నికను సవాలు చేస్తూ ఇద్దరు బీజేపీ నేతలు హైకోర్టులో మంగళవారం వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్నికల సంఘం నియమాలకు విరుద్ధంగా వారిద్దరి ఎన్నికల ఖర్చు రూ.14 లక్షల పరిమితిని దాటిందని, వారి ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఢిల్లీశాఖ అధ్యక్షడు విజేందర్ గుప్తా, ఆర్‌పీ మెహ్రా ఈ పిటిషన్లు దాఖలు చేసినట్లు ఆ పార్టీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇదిలాఉండగా ఊహించని రీతిలో తన సహచర మంత్రులు, మద్దతుదారులతో కలిసి ధర్నాకు దిగిన ందున ఈ ఇద్దరిపైనే సుప్రీం కోర్టులోనూ రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్‌లు) దాఖలయ్యాయి. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన ముఖ్యంత్రి, మంత్రులు వాటికి విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తున్నారని, వారిపై చర్య తీసుకోవాలని కోరుతూ న్యాయమూర్తి ఎంఎల్ శర్మ, మరో న్యాయవాది ఈ వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిని ప్రధాన న్యాయమూర్తి సదాశివం నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం మంగళవారం విచారణకు స్వీకరించింది.
Advertisement
Advertisement