భారతి రాజీనామా చేస్తేనే బిల్లుకు మద్దతు: లవ్లీ
Published Wed, Feb 12 2014 10:30 PM | Last Updated on Sat, Sep 2 2017 3:38 AM
న్యూఢిల్లీ: న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతి తన పదవికి రాజీనామా చేసేదాకా జన్‌లోక్‌పాల్ బిల్లుకు తాము మద్దతు ఇచ్చేదిలేదని కాంగ్రెస్ పార్టీ మరోమారు స్పష్టం చేసింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అరవింద్ సింగ్ లవ్లీ ఈ విషయమై మాట్లాడుతూ... ‘జన్‌లోక్‌పాల్ బిల్లు విషయంలో కేజ్రీవాల్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అబద్ధాల విషయంలో కేజ్రీవాల్ పేరును గిన్నిస్ బుక్కులోకి ఎక్కించాలి. ఆయన రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ప్రవర్తిస్తున్నారు. శని, ఆదివారాలు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం, అదీ బహిరంగ అసెంబ్లీ నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధం. ఇలాంటివి చేస్తూ ప్రచారం పొందాలని కేజ్రీవాల్ చూస్తున్నారు. ఇది లేనిపోని గందరగోళానికి దారితీస్తుంద’న్నారు.
Advertisement
Advertisement