
బాబు రాజకీయాలు భ్రష్టు పట్టించారు
విజయవాడ: ఓటుకు నోటు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిజాయితీని నిరూపించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ నేత సోమ్ నాథ్ భారతి అన్నారు. రాజకీయాలను భ్రష్టుపట్టించి కలుషితం చేసింది చంద్రబాబేనని ఘాటుగా విమర్శించారు. ఆమ్ ఆద్మీ పార్టీపై బీజేపీ సర్కార్ కక్ష సాధిస్తుందని ఆరోపించారు. స్మృతి ఇరానీ సహా ముగ్గురు కేంద్ర మంత్రులు నకలీ సర్టిఫికెట్లు ఇచ్చారని.. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.