న్యాయశాఖ మంత్రి సోమనాథ్ భారతి చుట్టూ అలముకున్న వివాదం నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ను కలిశారు.
న్యాయశాఖ మంత్రి సోమనాథ్ భారతి చుట్టూ అలముకున్న వివాదం నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ను కలిశారు. రాత్రిపూట ఢిల్లీవీధుల్లో దాడులు చేస్తున్న ఓ బృందాన్ని వెనకేసుకు వస్తున్నారన్న ఆరోపణలు భారతిపై వచ్చని విషయం తెలిసిందే. ఢిల్లీ మహిళా కమిషన్తో పాటు, మహిళా హక్కుల కార్యకర్తలు కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మంత్రి విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారంటూ ఆప్ ప్రభుత్వంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనను తొలగించాలా లేదా అన్న విషయమై అరవింద్ కేజ్రీవాల్ మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్తో ఆయన సమావేశం అయినట్లు తెలుస్తోంది. ఆయన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నరనేది కూడా కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశముంది.