ఢిల్లీ హైకోర్టులో సోమనాథ్‌కు చుక్కెదురు
న్యూఢిల్లీ: రాష్ట్ర పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆప్ నేత, న్యాయ శాఖ మాజీ మంత్రి సోమ్‌నాథ్ భారతి వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. 2014లో అప్పటి మంత్రిగా ఓ లాడ్జిపై దాడి చేసినప్పుడు ఓ ఆఫ్రికన్ మహిళా వేసిన వేధింపుల కేసుపై ట్రయల్ కోర్టు వేసిన ప్రశ్నలకు పోలీసులు సమాధానం ఇవ్వలేదని, దీంతో వారిపై చర్యలు తీసుకోవాలని సోమ్‌నాథ్ హైకోర్టులో పిటిషన్ వేశారు.
దీనిపై విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.రోహిణి, జస్టిస్ జయంత్ నాథ్‌లతో కూడా ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేసింది. ఇది అనవసరమైన పిటిషన్ అని ధర్మాసనం పేర్కొంది. సోమ్‌నాథ్ తరఫున్ సీనియర్ న్యాయవాది రామ్ జఠ్మలాని వాదించారు.