అమీ తుమీ | Aam Aadmi Party government escalates attack on Delhi Police, to meet Home Minister for suspension of SHOs | Sakshi
Sakshi News home page

అమీ తుమీ

Published Fri, Jan 17 2014 11:17 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM

Aam Aadmi Party government escalates attack on Delhi Police, to meet Home Minister for suspension of SHOs

సాక్షి, న్యూఢిల్లీ: ఆప్ సర్కారు, ఢిల్లీ పోలీసుల మధ్య వివాదం మరింత ముదిరింది. ఢిల్లీ పోలీసులు తమకు సహకరించడం లేదన్న ఫిర్యాదుతో పాటు నలుగురు పోలీ సు అధికారులను సస్పెండ్ చేయాలన్న డిమాండ్‌తో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను కలుసుకున్నారు. ఢిల్లీ పోలీసులు కూడా ఢిల్లీ సర్కారుపై లెప్టినెంట్ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. మంత్రులు తమ పనితీరులో జోక్యం కల్పించుకున్న వైనంపై లెఫ్ట్టినెంట్ గవర్నర్‌కు ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ నివేదిక సమర్పించారు. కేజ్రీవాల్ కోరినట్లుగా పోలీసు అధికారులను సస్పెండ్ చేయడానికి బస్సీ నిరాకరించారు. మాలవీయనగర్‌లో న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతి చట్టాన్ని ఉల్లంఘిం చినట్లు పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు.
 
 పరస్పర ఆరోపణలతో మంత్రివర్గ సభ్యులు మనీష్ సిసోడియా, సోమ్‌నాథ్ భారతి, రాఖీ బిర్లా తో కలిసి ముఖ్యమంత్రి కేజ్రీవాల్,  ఆప్ సర్కార్ ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్న నలుగురు పోలీసు అధికారులతో కలిసి కమిషనర్ బీఎస్ బస్సీ శుక్రవారం లెప్టినెంట్ గవర్నర్‌ను కలిశారు. గంటసేపు జరిగిన సమావేశంలో ఇరుపక్షాల ఆరోపణలు విన్న లెఫ్ట్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. అయితే గవర్నర్ హామీ తర్వాత కూడా కేజ్రీవాల్ సంతృప్తి చెందక హోమ్ మంత్రి షిండేను కలవాలని నిర్ణయించారు. డెన్మార్క్ మహిళపై గ్యాంగ్ రేప్ ఘటన జరిగిన పహాడ్‌గంజ్ ప్రాం తపు పోలీసు అధికారితో పాటు తన మంత్రుల ఆదేశాలను ఖాతరు చేయని మాలవీయనగర్, సాగర్‌పుర్ పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి అరవింద్‌కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. అయితే మంత్రుల జోక్యాన్ని గురించి బస్సీ కూడా లెఫ్ట్టినెంట్ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.
 
 ఈ ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్ చేయడం ఇప్పట్లో వీలుకాదని కేజ్రీవాల్‌కు బస్సీ స్పష్టం చేశారు. మాల వీయనగర్‌లో మంత్రి చట్టాన్ని ఉల్లంఘించారని, పోలీసు అధికారి నిబంధనల ప్రకారం ప్రవర్తించారని ముఖ్యమంత్రికి  బస్సీ వివరించినట్లు సమాచా రం. కాగా, లెఫ్టినెంట్ గవర్నర్‌తో సమావేశం గురిం చిన వివరాలను విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా మిడియా ముందుంచారు. మూడు అంశాలతో తాము లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలిశామని మొదటి డానిష్‌మహిళపై అత్యాచారం  కేసు కాగా రెండవది సాగర్‌పుర్‌లో మహిళను అత్తిం టివారు కాల్చిన కేసు అని మూడవది ఖిడ్కీ ఎక్స్‌టెన్షన్‌లో  మంత్రి సోమ్‌నాథ్ భారతీ సూచనమేరకు పోలీసు లు దాడి జరపడానికి నిరాకరించిన విషయమని ఆయన చెప్పారు. ముగ్గురు ఎస్‌హెచ్‌ఓలతో  పాటు ఏసీపీని సస్పెండ్ చేయాలని  తాము లెప్టినెంట్ గవర్నర్‌ను డిమాండ్ చేసినట్లు ఆయన చెప్పారు.  దీనిపై లెప్టినెంట్ గవర్నర్ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారని ఆయన చెప్పారు. అయితే పోలీస్ కమిషనర్ స్సీ పోలీసు అధికారులను సస్పెండ్ చేయడం కుదరదని చెప్పారని సిసోడియా చెప్పారు. దర్యాప్తు ముగి సేంతవరకు పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని ఆయనడిమాండ్ చేశారు.
 
 మం త్రులు  కోరిన వెంటనే ఘటనాస్థలం లో నింది తులుగా పేర్కొంటున్న వారిని అరెస్టు చేయ డం వీలుకాదని, అందుకు సెర్చ్ వారంట్ కావాలని ఢిల్లీ పోలీసులు చేసిన వాదనను ఆయనను తోసిపుచ్చారు. ఆ తర్వాత 48 గంటల్లో కూడా పోలీ సులు ఏ  చర్య చేపట్టలేదని ఆయన ఆరోపించా రు. తమది ‘విజిలెంటజమ్’ అని ఆరోపిస్తున్నారని కానీతమది విభిన్నమైన ప్రభుత్వమని ఆయన మంత్రుల చర్యలను సమర్థించుకున్నారు. పోలీసులు తమకింద ఉన్నా లేకపోయినా ఏదైనా తప్పు జరిగితే  తాము చూస్తూ కూర్చోబోమని ఆయన చెప్పారు. ‘ఇది షీలాదీక్షిత్ ప్రభుత్వం కాదు.. పోలీ సులు మాకు రిపో ర్టు చేయనట్లయితే మేము నిస్సహాయులం అని చెప్పబోము.. ఢిల్లీ వాసులకు  ఏం కావాలో అది చేసితీరుతాం.. పోలీసు లు దారికి రానట్లయితే మేము వారిని చక్కదిద్దుతామని..’  సిసోడియా తెలిపారు. పోలీసు ప్రతి నిధుల్లా ప్రవర్తించరాదని ఆయన మీడియాను కోరారు. ఈ వ్యాఖ్యపై మీడి యా ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సమావేశంలో గందరగోళం నెల కొంది.
 
 ఉన్నతస్థాయి విచారణకు ఎల్జీ ఆదేశం
 రెండు రోజులుగా ఢిల్లీ ప్రభుత్వ మంత్రులు, పోలీస్ శాఖ మధ్య రగులుతున్న వివాదంపై లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ శుక్రవారం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు.   
 
 న్యాయశాఖ మంత్రిని బర్తరఫ్‌చేయాలి: బీజేపీ
 న్యూఢిల్లీ: రాష్ట్ర న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను బీజేపీ నేత హర్షవర్ధన్ శుక్రవారం డిమాండ్ చేశారు. సామూహిక అత్యాచారానికి గురైన డానిష్ యువతి పేరును మంత్రి భారతి బయటపెట్టడం అనుచితచర్య అని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement