న్యూఢిల్లీ: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూర్చడానికే ఆమ్ ఆద్మీ పార్టీ పోటీచేస్తోందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. కాంగ్రెస్ ఓటుబ్యాంక్‌లో చీలిక తేవడం ద్వారా బీజేపీకి లబ్ధిచేకూర్చడమే ఆప్ లక్ష్యమని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ ఆరోపించారు. ఆయన శనివారం తూర్పు ఢిల్లీలోని ముస్తఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. త్రిలోక్‌పురిలో ఇటీవల జరిగిన మతకలహాల్లో చాలామంది తీవ్రంగా నష్టపోయినా బీజేపీ, ఆప్ నేతలకు వారిని పలకరించే తీరిక కూడా లేకపోయిందన్నారు. ఆప్ అధినేత కేజ్రీవాల్ నిజస్వరూపం ఢిల్లీవాసులకు ఇప్పటికే అర్థమైందని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే రంగ్‌పురి పహరీలో కూడా బీజేపీ సర్కారు అక్రమ కూల్చివేతలను చేపట్టి స్థానికులకు నిలువ నీడ లేకుండా చేసిందని విమర్శించారు. కాగా, డీపీసీసీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్‌పార్టీకి తమ పూర్తి మద్దతు ఇస్తామని ఉత్తరాఖండ్ వాసులు ప్రతిజ్ఞ చేశారు.
బీజేపీకి ఆప్ తోక పార్టీ
Published Sat, Jan 3 2015 10:11 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
Advertisement