Delhi Pradesh Congress
-
బీజేపీకి ఆప్ తోక పార్టీ
న్యూఢిల్లీ: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూర్చడానికే ఆమ్ ఆద్మీ పార్టీ పోటీచేస్తోందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. కాంగ్రెస్ ఓటుబ్యాంక్‌లో చీలిక తేవడం ద్వారా బీజేపీకి లబ్ధిచేకూర్చడమే ఆప్ లక్ష్యమని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ ఆరోపించారు. ఆయన శనివారం తూర్పు ఢిల్లీలోని ముస్తఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. త్రిలోక్‌పురిలో ఇటీవల జరిగిన మతకలహాల్లో చాలామంది తీవ్రంగా నష్టపోయినా బీజేపీ, ఆప్ నేతలకు వారిని పలకరించే తీరిక కూడా లేకపోయిందన్నారు. ఆప్ అధినేత కేజ్రీవాల్ నిజస్వరూపం ఢిల్లీవాసులకు ఇప్పటికే అర్థమైందని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే రంగ్‌పురి పహరీలో కూడా బీజేపీ సర్కారు అక్రమ కూల్చివేతలను చేపట్టి స్థానికులకు నిలువ నీడ లేకుండా చేసిందని విమర్శించారు. కాగా, డీపీసీసీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్‌పార్టీకి తమ పూర్తి మద్దతు ఇస్తామని ఉత్తరాఖండ్ వాసులు ప్రతిజ్ఞ చేశారు. -
దర్యాప్తు వేగం పెంచండి
న్యూఢిల్లీ: నగరంలో నివసిస్తున్న ఈశాన్య వాసుల భద్రత విషయంలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ జోక్యం చేసుకోవాలని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) కోరింది. అదేవిధంగా మణిపూర్ యువకుడి హత్య కేసుపై విచారణను వేగవంతం చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్‌సింగ్ లవ్లీ రాజ్‌నాథ్‌కు బుధవారం ఓ లేఖ రాశారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువకులకు ముఖ్యంగా విద్యార్థుల భద్రత కోసం నగరంలోని కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో సిబ్బందిని మోహరించాల్సిందిగా పోలీసు శాఖను ఆదేశించాలని తన లేఖలో లవ్లీ కోరారు. కాగా సోమవారం తెల్లవారుజామున నగరంలోని కోట్ల ముబారక్పూర్ ప్రాంతంలో ఐదుగురు సభ్యులుగల ఓ బృందం 29 ఏళ్ల అఖా సలౌని అనే యువకుడిని కొట్టిచంపిన సంగతి విదితమే. మృతుడు బీపీఓ కంపెనీలో ఉద్యోగి. మృతుడు బీపీఓ కంపెనీలో ఉద్యోగి. నేరానికి పాల్పడేందుకు నిందితులు ఓ ఓ గుడ్డముక్కను వినియోగించారని, అయితే దానిని స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. దక్షిణ ఢిల్లీలో జరిగిన ఈ ఘటన అక్కడికి సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరా దృశ్యాల్లో నమోదైంది. ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కేంద్ర హోం శాఖ మంత్రిని లవ్లీ తన లేఖలో కోరారని డీపీసీసీ ప్రధాన అధికార ప్రతినిధి ముఖేశ్ శర్మ చెప్పారు. భద్రత విషయంలో ఈశాన్య వాసులకున్న అపోహలన్నీ తొలగిపోయేవిధంగా చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో నిర్మాణాత్మక చర్యలను ఇకనైనా తీసుకోకపోయినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగుతుందన్నారు. పట్టించుకోవడం లేదు ఈశాన్య వాసులపై దాడుల ఘటనలను పోలీసులు తీవ్రంగా పరిగణించడం లేదని డీపీసీసీ ప్రధాన అధికార ప్రతినిధి ముఖేశ్ శర్మ ఆరోపించారు. దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈశాన్యవాసులు నివసించే ప్రాంతాల్లో అత్యధిక సంఖ్యలో బలగాలను మోహరించాలన్నారు. ఈ తరహా జాతివివక్ష దాడుల ప్రభావం అంతర్జాతీయ పర్యాటకులపై తీవ్రస్థాయిలో పడుతోందన్నారు. అందువల్ల వీటిని నిరోధించేందుకు కచ్చితంగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఆప్ మాజీ మంత్రి సోమ్‌నాథ్ భారతి కూడా దక్షిణాఫ్రికా మహిళలపై గతంలో దాడులకు పాల్పడ్డారని, ఆయనపై అప్పట్లో తగు చర్యలు తీసుకుని ఉన్నట్టయితే ఈ పరిస్థితి తలెత్తేది కాదన్నారు. పోలీసు కస్టడీకి నాలుగో నిందితుడు మణిపూర్ యువకుడి హత్య కేసులో నాలుగో నిందితుడు ఆజాద్ చౌదరిని స్థానిక న్యాయస్థానం బుధవారం ఒకరోజు పోలీసు కస్టడీకి ఆదేశించింది. ఈమేరకు మెట్రోపాలిటన్ కోర్టు న్యాయమూర్తి అశోక్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ప్రత్యేక ఆరోపణలు చేయండి దురుసుగా వ్యవహరించిన ఇద్దరు న్యాయవాదులపై నిర్దిష్టమైన ఆరోపణలు చేయాలని ఢిల్లీ హైకోర్టు బాధిత మహిళా అడ్వొకేట్‌ను ఆదేశించింది. వాటితో తాము సంతృప్తిచెందితే ఆ ఇద్దరు న్యాయవాదులకు కోర్టు ఆదేశాల ఉల్లంఘన నోటీసులు పంపుతామని ప్రధాన న్యాయమూర్తి జి. రోహిణి, జస్టిస్ ఆర్.ఎస్.ఎండ్లా నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది. -
ఓటమి బాధ్యత వారిదే!
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో పార్టీ పునరుద్ధరణకు సంబంధించి తన వద్ద ఓ వ్యూహం ఉందని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థులుగా బరిలోకి దిగినవారు ఘోర పరాజయం పాలవడానికి కపిల్ సిబల్, అజయ్ మాకెన్, సందీప్ దీక్షిత్‌లతోపాటు ఇతర ఎంపీలే కారణమని అన్నారు. అంతేతప్ప ఇందుకు పార్టీ కేంద్ర అధిషా ్టనం తప్పు ఎంతమాత్రం లేదన్నారు. ఇటీవల ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో కొంతమంది రాహుల్ గాంధీపై విమర్శనాస్త్రాలు సంధిస్తుండడంతో ఆయన పై విధంగా స్పందించారు. ఢిల్లీకి సంబంధించినంతవరకూ పార్టీ సరైన ఫలితాలను సాధించలేకపోవడానికి ఓటమిపాలైన ఏడుగురు పార్టీ అభ్యర్థులే బాధ్యత వహించాలన్నారు. ఈ ఓటమికి ఎవరైన బాధ్యులు ఉన్నారంటే మాజీ ఎంపీలేనని, వారితోపాటు తాను కూడా అందులో ఒకరినన్నారు. కాగా ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థులంతా మూడోస్థానానికే పరిమితమైన సంగతి విదితమే. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) కార్యవర్గంలో యువతకు ప్రాధాన్యమిస్తానని అర్వీందర్ సింగ్ లవ్లీ పేర్కొన్నారు. శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న పార్టీకి కొత్తరూపం తీసుకొస్తానన్నారు. ‘అజయ్ మాకెన్ రెండు సార్లు ఎంపీగా గెలిచారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అంతేకాకుండా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను సైతం నిర్వర్తించారు. బరిలోకి దిగినచోటే ఆయన ఓడిపోయారంటే అందుకు అధిష్టానం ఏవిధంగా బాధ్యత వహిస్తుంది’ అని ప్రశ్నించారు. పోరాటాలకు సన్నద్ధం ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బతిన్న కాంగ్రెస్ ప్రజా సమస్యలపై దృష్టి సారించింది. శుక్రవారం తుపాను బీభత్సం తరువాత మూడురోజుల నుంచి ఎదుర్కొంటున్న విద్యుత్ కోతలు, మరోవైపు నీటి ఎద్దడిపై దృష్టి సారించిన కాంగ్రెస్ పోరాటాలకు సిద్ధమవుతోంది. నజఫ్‌గఢ్, రోహిణి, ఉత్తమన్నగర్లతోపాటు ఢిల్లీ శివారు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్రమైన కరెంటు కోతలను ఎదుర్కొంటున్నారు. ఒక్కోసారి మూడు నుంచి ఐదు గంటలపాటు వరుసగా విద్యుత్ కోత ఉంటోంది. ఈ నేపథ్యంలో నిరంతరాయంగా నీటి, విద్యుత్ సరఫరాను చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. నగరంలో విద్యుత్ పరిస్థితి దారుణంగా ఉందని ఢిల్లీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ముఖేష్ శర్మ అన్నారు. డీపీసీసీ చీఫ్ అర్విందర్‌సింగ్ లవ్లీ అధ్యక్షతన ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలంతా సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. గత మూడు నెలలుగా విద్యుత్ కొరత తీవ్రంగా ఉందని, దీనికితోడు శుక్రవారం తుపాను నగరానికి 35 గంటలపాటు విద్యుత్ లేకుండా చేసిందని ఆయన అన్నారు. అయితే పునరుద్ధరణ పనులు పూర్తయ్యేవరకు మరో రెండు రోజులు పడుతుందని విద్యుత్ అదికారులు చెబుతున్నారని ముఖేష్ తెలిపారు.