న్యూఢిల్లీ: నగరంలో నివసిస్తున్న ఈశాన్య వాసుల భద్రత విషయంలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ జోక్యం చేసుకోవాలని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) కోరింది. అదేవిధంగా మణిపూర్ యువకుడి హత్య కేసుపై విచారణను వేగవంతం చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్‌సింగ్ లవ్లీ రాజ్‌నాథ్‌కు బుధవారం ఓ లేఖ రాశారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువకులకు ముఖ్యంగా విద్యార్థుల భద్రత కోసం నగరంలోని కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో సిబ్బందిని మోహరించాల్సిందిగా పోలీసు శాఖను ఆదేశించాలని తన లేఖలో లవ్లీ కోరారు. కాగా సోమవారం తెల్లవారుజామున నగరంలోని కోట్ల ముబారక్‌పూర్ ప్రాంతంలో ఐదుగురు సభ్యులుగల ఓ బృందం 29 ఏళ్ల అఖా సలౌని అనే యువకుడిని కొట్టిచంపిన సంగతి విదితమే.
మృతుడు బీపీఓ కంపెనీలో ఉద్యోగి. మృతుడు బీపీఓ కంపెనీలో ఉద్యోగి. నేరానికి పాల్పడేందుకు నిందితులు ఓ ఓ గుడ్డముక్కను వినియోగించారని, అయితే దానిని స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. దక్షిణ ఢిల్లీలో జరిగిన ఈ ఘటన అక్కడికి సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరా దృశ్యాల్లో నమోదైంది. ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కేంద్ర హోం శాఖ మంత్రిని లవ్లీ తన లేఖలో కోరారని డీపీసీసీ ప్రధాన అధికార ప్రతినిధి ముఖేశ్ శర్మ చెప్పారు. భద్రత విషయంలో ఈశాన్య వాసులకున్న అపోహలన్నీ తొలగిపోయేవిధంగా చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో నిర్మాణాత్మక చర్యలను ఇకనైనా తీసుకోకపోయినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగుతుందన్నారు.
పట్టించుకోవడం లేదు
ఈశాన్య వాసులపై దాడుల ఘటనలను పోలీసులు తీవ్రంగా పరిగణించడం లేదని డీపీసీసీ ప్రధాన అధికార ప్రతినిధి ముఖేశ్ శర్మ ఆరోపించారు. దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈశాన్యవాసులు నివసించే ప్రాంతాల్లో అత్యధిక సంఖ్యలో బలగాలను మోహరించాలన్నారు. ఈ తరహా జాతివివక్ష దాడుల ప్రభావం అంతర్జాతీయ పర్యాటకులపై తీవ్రస్థాయిలో పడుతోందన్నారు. అందువల్ల వీటిని నిరోధించేందుకు కచ్చితంగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఆప్ మాజీ మంత్రి సోమ్‌నాథ్ భారతి కూడా దక్షిణాఫ్రికా మహిళలపై గతంలో దాడులకు పాల్పడ్డారని, ఆయనపై అప్పట్లో తగు చర్యలు తీసుకుని ఉన్నట్టయితే ఈ పరిస్థితి తలెత్తేది కాదన్నారు.
పోలీసు కస్టడీకి నాలుగో నిందితుడు
మణిపూర్ యువకుడి హత్య కేసులో నాలుగో నిందితుడు ఆజాద్ చౌదరిని స్థానిక న్యాయస్థానం బుధవారం ఒకరోజు పోలీసు కస్టడీకి ఆదేశించింది. ఈమేరకు మెట్రోపాలిటన్ కోర్టు న్యాయమూర్తి అశోక్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.
ప్రత్యేక ఆరోపణలు చేయండి
దురుసుగా వ్యవహరించిన ఇద్దరు న్యాయవాదులపై నిర్దిష్టమైన ఆరోపణలు చేయాలని ఢిల్లీ హైకోర్టు బాధిత మహిళా అడ్వొకేట్‌ను ఆదేశించింది. వాటితో తాము సంతృప్తిచెందితే ఆ ఇద్దరు న్యాయవాదులకు కోర్టు ఆదేశాల ఉల్లంఘన నోటీసులు పంపుతామని ప్రధాన న్యాయమూర్తి జి. రోహిణి, జస్టిస్ ఆర్.ఎస్.ఎండ్లా నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది.
దర్యాప్తు వేగం పెంచండి
Published Wed, Jul 23 2014 10:38 PM | Last Updated on Sat, Sep 2 2017 10:45 AM
Advertisement