Arvindar Singh
-
బీజేపీకి ఆప్ తోక పార్టీ
న్యూఢిల్లీ: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూర్చడానికే ఆమ్ ఆద్మీ పార్టీ పోటీచేస్తోందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. కాంగ్రెస్ ఓటుబ్యాంక్‌లో చీలిక తేవడం ద్వారా బీజేపీకి లబ్ధిచేకూర్చడమే ఆప్ లక్ష్యమని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ ఆరోపించారు. ఆయన శనివారం తూర్పు ఢిల్లీలోని ముస్తఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. త్రిలోక్‌పురిలో ఇటీవల జరిగిన మతకలహాల్లో చాలామంది తీవ్రంగా నష్టపోయినా బీజేపీ, ఆప్ నేతలకు వారిని పలకరించే తీరిక కూడా లేకపోయిందన్నారు. ఆప్ అధినేత కేజ్రీవాల్ నిజస్వరూపం ఢిల్లీవాసులకు ఇప్పటికే అర్థమైందని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే రంగ్‌పురి పహరీలో కూడా బీజేపీ సర్కారు అక్రమ కూల్చివేతలను చేపట్టి స్థానికులకు నిలువ నీడ లేకుండా చేసిందని విమర్శించారు. కాగా, డీపీసీసీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్‌పార్టీకి తమ పూర్తి మద్దతు ఇస్తామని ఉత్తరాఖండ్ వాసులు ప్రతిజ్ఞ చేశారు. -
బీజేపీపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
ఢిల్లీలోని అధికార యంత్రాగాన్ని కాషాయీకరణ చేయడానికి బీజేపీ యత్నిస్తోందని ఢిల్లీ కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదుచేశారు. డీపీసీసీఅధ్యక్షుడు అర్విందర్ సింగ్ నేతత్వంలో శుక్రవారం ఎన్నికల కమిషనర్‌ను కలిసిన కాంగ్రెస్ ప్రతినిధి బృంధంలో నగరంలో అధికార యంత్రాంగాన్ని కాషాయమయం చేయడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. గురువారం 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీచేసిన నేపథ్యంలో కాంగ్రెస్ ఈసీకి ఈమేరకు ఫిర్యాదు చేసింది. అంతకు ముందే కాంగ్రెస్ నేతలు ఈ విషయమై ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. హరూన్ యూసఫ్, ముఖేష్ శర్మ, కేసీ మిట్టల్ తదితర నేతలతో ఎన్నికల కమిషనర్‌ను కలిసిన అనంతరం లవ్లీ మీడియాతో మాట్లాడారు. ‘ఢిల్లీలో మూడు శాసనసభ స్థానాలకు ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. శాసనసభఎన్నికలు కూడా త్వరలో జరిగే అవకాశాలున్నాయి. బీజేపీ నేతలు ఢిల్లీ ప్రభుత్వ అదికారులను బెదిరిస్తున్నారు. కేంద్రంలో తమ ప్రభుత్వం ఉండడంతో వారు ప్రభుత్వ యంత్రాంగాన్ని కాషాయమయంగా మారుస్తున్నారు’ అని లవ్లీ ఆరోపించారు. బీజేపీ నేతలు కొద్ది రోజుల కిందట హోం శాఖ మంత్రి రాజ్‌నాథ సింగ్‌ను కలిశారని, ఆ తరువాత ప్రధాన కార్యదర్శిని బదిలీ చేశారని లవ్లీ ఆరోపించారు. అదేవిధంగా బీజేపీ ప్రతినిధి బృందం పోలీస్ కమిషనర్ బస్సీని కలిసి పలువురు ఎస్హెచ్ఓలపై ఫిర్యాదు చేశారని. దీంతో సీనియర్ ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారని లవ్లీ ఆరోపించారు. తమ పార్టీ మాట వినకపోతే బదిలీ చేయిస్తామంటూ బీజేపీ నాయకులు పోలీసు అధికారులను బెదిరిస్తున్నారన్నారు, ఎన్నికల్లో పోలీసులు కీలకపాత్ర పోషిస్తారని ఈ విషయంలో తక్షణం జోక్యం చేసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను కోరినట్లు లవ్లీ చెప్పారు. అధికారులను బదిలీ చేయాల్సిందిగా ఓ రాజకీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశాలివ్వడం ప్రజాస్వామ్యంలో ఇదే మొదటిసారని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన చెప్పారు. -
మర్యాదగా మాట్లాడండి: లవ్లీ
ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితుడైన అర్విందర్‌సింగ్ లవ్లీ మర్యాదగా మాట్లాడాలంటూ ఆప్ నేతలను హెచ్చరించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటుచేయాలన్న చిత్తశుద్ధి లేదని, అందుకే తమపై అవాకులు చెవాకులు పేలుతూ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని ఆరోపిం చారు. ప్రజల తీర్పును మన్నించి, మరోమారు ఎన్నికలు రాకుండా ఉండడం కోసం ఆమ్ ఆద్మీ పార్టీకి తాము బయటినుంచి మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చామన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి, ఆప్ తన మేనిఫెస్టోను అమలుచేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. ఆప్ నేతలు భాష విషయంలో మర్యాద దాటి ప్రవర్తిస్తున్నారని, కాంగ్రెస్ సహనాన్ని పరీక్షించొద్దని హెచ్చరించారు. ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన అబద్ధపు హామీల వెనుక ఉన్న నిజాన్ని బట్టబయలు చేయడం కోసమే తమ పార్టీ మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చిందన్నారు. ఆప్ ప్రజలను తప్పుదారి పట్టించిందని, విద్యుత్తు, నీటి విషయంలో అమలు చేయలేని హామీలను ఇచ్చిం దని, దానిని నిరూపించేందుకే మద్దతిస్తున్నట్లు చెప్పారు. -
కొత్త సారథి ఎవరు ?
న్యూఢిల్లీ:ఇటీవల విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాజయానికి బాధ్యత వ హిస్తూ జైప్రకాశ్ అగర్వాల్ ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షపదవికి రాజీనామా చేయడంతో ఇప్పుడీ పదవి ఎవరికి దక్కుతుందనే దానిపై ఊహాగానాలు మొదల య్యాయి. అగర్వాల్ రాజీనామాను ఆమోదించినట్లు పార్టీ ఇంకా ప్రకటించలేదు కానీ ఆయన వారసుడి ఎంపికపై చర్చలు నడుస్తున్నాయి. గతంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తరువాత కూడా అగర్వాల్ రాజీనామా చేశారు. అయితే అప్పట్లో ఆయన రాజీనామాను ఆమోదించలేదు. ఆరు సంవత్సరాల కింద అగర్వాల్ డీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత కొన్ని నెలలకే నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. లోక్‌సభ ఎన్నికల్లో కూడా పార్టీ ఏడింటికి ఏడు స్థానాలను గెలుచుకుంది. ఈశాన్య ఢిల్లీ నుంచి అగర్వాల్ స్వయంగా గెలిచారు. తదనంతరం ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. ముఖ్యమంత్రికి అగర్వాల్‌కు మధ్య సయోధ్య లేదన్న వార్తలొచ్చాయి. అనేక సందర్భాల్లో వారి మధ్యనున్న విభేదాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. రాహుల్‌గాంధీ ఆదేశంతో వీళ్లు తమ విభేదాలను పక్కన బెట్టినట్లు కనిపించినప్పటికీ పార్టీ నుంచి సరైన సహకారం అందలేదని షీలాదీక్షిత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత పేర్కొన్నారు. ఈ ఆరోపణపై అగర్వాల్ స్పందించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యతను వహిస్తూ, ఆమ్ఆద్మీ పార్టీ ఏర్పాటుచేసే ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతును వ్యతిరేకిస్తూ ఆయన రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో అగర్వాల్ రాజీనామాను పార్టీ ఆమోదించవచ్చని, డీపీసీసీ పీఠం హరూన్ యూసుఫ్ లేదా అర్విందర్ సింగ్ లవ్లీ లేదా అజయ్ మాకెన్‌కు గానీ దక్కవచ్చని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారని, అందువల్ల ఈ ఓటుబ్యాంకు కాపాడుకోవడానికి పీసీసీ అధ్యక్ష పదవిని హరూన్ యూసుఫ్‌కు కట్టబెట్టవచ్చని చెబుతున్నారు. హరూన్ షీలా సర్కారులో విద్యుత్‌శాఖ మంత్రిగా ఉన్నారు. గాంధీనగర్ నుంచి గెలిచిన మరో మంత్రి అర్విందర్ సింగ్ లవ్లీ పేరును కూడా అధిష్టానం పరిశీలించవచ్చని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత ఢిల్లీ కాంగ్రెస్‌లో షీలాదీక్షిత్ పాత్ర తగ్గిపోవచ్చని, ఆమెకు కేంద్ర రాజకీయాల్లో స్థానం ఇవ్వవచ్చని కొందరు వాదిస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర రాజకీయాల్లో ఉన్న అజయ్ మాకెన్‌కు ఢిల్లీ కాంగ్రెస్‌లో కీలక స్థానం అప్పగించవచ్చని అంటున్నారు. ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి: కార్యకర్తలకు షీలా సూచన ఎన్నికల రేసులో వెనుకబడిన ప్రతిసారి కాంగ్రెస్ మళ్లీ పుంజుకుని తన సత్తా చాటుకుందని మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ అన్నారు. ఎలాంటి సవాలునైనా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆమె సోమవారం పిలుపు ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాజయం తరువాత ఆమె మెట్టమొదటిసారిగా ఆమె పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్ కార్యకర్తలు చిత్తశుద్ధితో పనిచేసి పార్టీకి మరోసారి భారీ విజయం కట్టబెట్టాలని కోరారు. ఓటమికి నిరాశపడకుండా పనిచేయాలని సూచిం చారు. రాజేందర్‌నగర్ నియోజకవర్గంలో 800 మంది కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. రాజేందర్ నగర్ షీలా మంత్రివర్గ సహచరుడైన రమాకాంత్ గోస్వామి నియోజకవర్గం. ఇక్కడ ఆయన ఓటమి పాలయ్యారు. మహిళలను అంతా గౌరవించాలి మహిళ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని షీలా దీక్షిత్ అన్నారు. మనదేశంలో మహిళలను ఇప్పటికీ రెండోస్థాయి వ్యక్తులుగా చూసే సంస్కృతి ఉందన్నారు. వారి సంరక్షణకు ఎలాంటి చట్టాలూ అవసరం లేదని, సమాజం తగిన భద్రత కల్పిస్తే చాలన్నారు. నిర్భయ ఘటనకు ఏడాది నిండిన సందర్భంగా నగరంలో జాతీయ మహిళా సంఘం సోమవారం ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడుతూ ఆమె పైమాటననారు. కేంద్రమంత్రి గిరిజా వ్యాస్, ఇతర రాజకీయ పక్షాల మహిళా నాయకురాళ్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.