తప్పుచేశానని ఒప్పుకున్న హిల్లరీ
వాషింగ్టన్: సెనేటర్‌గా ఉన్న సమయంలో ఇరాక్‌పై యుద్ధానికి అనుకూలంగా ఓటు వేసి పెద్ద తప్పుచేశానని డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థి పదవికి పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్ చెప్పారు. 2002లో అప్పటి అధ్యక్షుడు జార్జి బుష్ ప్రభుత్వానికి ఇరాక్ పై దాడి చేసే అవకాశమిచ్చినందుకు పశ్చాత్తాప పడుతున్నానన్నారు. ప్రథమ మహిళగా ఉన్న సమయంలో వైద్యరంగంలో మెరుగైన సంస్కరణలు చేపట్టలేకపోయినందుకు మూడు నెలల క్రితం హిల్లరీ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.
కాగా, అమెరికా అధ్యక్షురాలిగా హిల్లరీ క్లింటన్ ఎన్నికైతే ఉపాధ్యక్ష పదవి కూడా మహిళకే దక్కుతుందని హిల్లరీ ప్రచార కమిటీకి సారధ్యం వహిస్తున్న జాన్ పొడెస్టా చెప్పారు.