క్రైమ్: అఫ్తాబ్ పూనావాలా.. యావత్ దేశాన్ని విస్మయానికి గురి చేసిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో ఏకైక, ప్రధాన నిందితుడు. మనస్పర్థలతో సహ భాగస్వామి శ్రద్ధను చంపేసి, శరీరాన్ని 35 ముక్కలు చేసి, ఫ్రిడ్జ్‌లో భద్రపర్చి ఆపై ఆ భాగాలను వివిధ చోట్ల పడేశాడతను. అయితే..
ఈ కేసులో ఇప్పుడు పోలీసులు మరో ఆసక్తికరమైన విషయాన్ని ఢిల్లీ కోర్టుకు వెల్లడించారు. ఆఫ్తాబ్ పూనావాలా శిక్షణ పొందిన చెఫ్ అని, మాంసాన్ని సైతం ఎలా భద్రపర్చాలో అతనికి తెలుసని పోలీసులు కోర్టుకు తాజాగా నివేదించారు. తాజ్ హోటల్‌లో అఫ్తాబ్ చెఫ్ ట్రైనింగ్ తీసుకున్నాడు. అలాగే మాంసాన్ని ఎలా భద్రపర్చడమో కూడా అతనికి తెలుసు. నేరంలో అది తనకి సాయపడిందని అఫ్తాబ్ ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే..
డ్రై ఐస్, అగరబత్తీలతో పాటు శ్రద్ధను హత్య చేసిన తర్వాత నేలను శుభ్రం చేసేందుకు.. కొన్ని రసాయనాలను ఆర్డర్ చేశాడు అని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు. శ్రద్ధను హత్య చేసిన వారంలోపే మరో యువతితో డేటింగ్ ప్రారంభించాడని, ఆ కొత్త గర్ల్‌ఫ్రెండ్‌కు శ్రద్ధ రింగ్‌నే బహుకరించాడని పోలీసులు తెలిపారు.
ఈ కేసులో ఢిల్లీ పోలీసుల తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమిత్ ప్రసాద్ వాదనలు వినిపిస్తున్నారు. తాజా విచారణ సందర్భంగా.. ఆయన కేసు దర్యాప్తులో పోలీసులు తాజాగా సాధించిన పురోగతిని కోర్టుకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment