ప్రతీకాత్మక చిత్రం
Prisoner declared dead doctors wakes up: వైద్యులు కొంతమందిని కచ్చితంగా చనిపోతాడు అని నిర్ధారించిన తర్వాత కూడా బ్రతికి బట్టకట్టగలిగిన వాళ్లను చూశాం. పైగా వైద్యులు ఇది మిరాకిల్ లేదా దేవుడు చేసిన అద్భుతం అని చెబుతుండటం గురించి విన్నాం. కానీ ఒక వ్యక్తి చనిపోయాడని నిర్ధారించుకుని పోస్ట్ మార్టం చేయాలని సమయాత్తమవుతుండగా ఆ వ్యక్తి మేల్కొంటే ఎవ్వరైనా భయపడిపోవడం సహజం. అచ్చం అలాంటి సంఘటనే స్పెయిన్‌లో చోటు చేసుకుంది.
అసలు విషయంలోకెళ్తే...స్పెయిన్‌లో విల్లాబోనాలోని అస్టురియాస్ సెంట్రల్ పెనిటెన్షియరీలో ఉన్న గొంజాలో మోంటోయా జిమెనెజ్ అనే ఖైదీ అనారోగ్యానికి గురైయ్యాడు. దీంతో అతనిని ఓవిడోలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లీగల్ మెడిసిన్‌కు తరలించారు. అయితే ఆన్-డ్యూటీ వైద్యులు, ఫోరెన్సిక్ నిపుణుడు జిమెనెజ్ చనిపోయినట్లు ధృవీకరించారు. ఈ మేరకు ఖైదీ చనిపోయినట్లు ప్రకటించినప్పుడు వర్తించే ప్రామాణిక ప్రియాన్ విధానంలో భాగంగా అతని కుటుంబానికి తెలియజేశారు.
అంతేకాదు అతని శరీరం సైనోసిస్ సంకేతాలను చూపించిందని, ఆక్సిజన్ లేకపోవడం వల్ల చర్మం రంగు మారిందని వైద్యులు నివేదికలో పేర్కొనడం గమనార్హం. అయితే జిమెనెజ్ పోస్ట్‌మార్టం చేసేందుకు అతని శరీరంపై ప్రణాళిక బద్ధంగా నిర్వహించాల్సిన కోతల తాలుకా పెన్ గుర్తుల కూడా ఉన్నాయి. కానీ ఇంతలో జిమెనెజ్ వింతగా అరుస్తూ మేల్కొన్నాడు. దీంతో వైద్యులు ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందారు. ఈ మేరకు ఆ వ్యక్తిని మరొక ఆస్ప్రతికి తరలించి తగిన వైద్యం అందించారు. ప్రసుత్తం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని స్పానిష్ జైలు అధికారులు తెలిపారు.
(చదవండి: ఈ పార్క్‌లో మెరిసేదంతా బంగారమే!... ఔను! రూ. 87 లక్షల గోల్డ్ క్యూబ్!!)
Comments
Please login to add a commentAdd a comment