యాదాద్రి భువనగిరి జిల్లా జగ్గన్న చెరువు కింద గల మాదాపురం ఆయకట్టు రైతులు ఏటా యాసంగి పంటనే సాగుచేస్తారు. వానాకాలం సాగుచేస్తే చెరువు నిండి పంట మునుగుతుందనేది వారి భయం. కానీ వారి అంచనాలు తప్పాయి. మండు వేసవిలోనూ పంటలు నీటమునిగాయి.
కొండపోచమ్మ సాగర్ నుంచి చెరువులను నింపేందుకు తుర్కపల్లి మండలం గోపాలపురం చెరువులోకి నీటిని వదలడంతో సోమవారం చెరువు అలుగుపోసింది. అక్కడి నుంచి జగ్గన్న చెరువులోకి నీళ్లు చేరాలి. కానీ ఈ నీళ్లు వరి పంటలను ముంచెత్తుతూ చెరువులోకి వెళ్లాయి. వేసేదే ఒక్క పంట.. అదీ అనుకోని కాలంలో నీటి పాలైందని రైతులువాపోతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, యాదాద్రి భువనగిరి
నీటిపాలైన వరి చేనును చూపుతున్న ఓ రైతు
Comments
Please login to add a commentAdd a comment