
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ చైర్మన్స్ చాంబర్ చైర్మన్‌గా యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ రాజు వెన్‌రెడ్డి ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఆదివారం రాష్ట్రంలోని మున్సిపల్ చైర్మన్లు సమావేశంలో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. చాంబర్ ప్రధాన కార్యదర్శిగా ఎడ్మ సత్యంరెడ్డి, ఉపాధ్యక్షురాలిగా సీహెచ్ మంజుల, సలహాదారుల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ముఖ్య సలహాదారుల కమిటీ సభ్యులుగా బీఎస్ కేశవ్ (గద్వాల), కె.నరేందర్ (షాద్‌నగర్–రంగారెడ్డి), ఎ.నర్సింహ (దేవరకొండ–నల్లగొండ), పి.జమున (జనగామ) ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాజు వెన్‌రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ల సమస్యలను సీఎం, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment