
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ అసోసియేషన్ లిమిటెడ్ (హాకా) చైర్మన్‌గా మహబూబాబాద్ జిల్లా మరిపెడకు చెందిన మచ్చ శ్రీనివాసరావును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈమేరకు వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి ఎం.రఘునందన్‌రావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి ఏర్పాట్లు చేపట్టాలని హాకా మేనేజింగ్ డైరెక్టర్‌ను ఆదేశించారు.