macha srinivasa rao
-
హాకా చైర్మన్‌గా మచ్చ శ్రీనివాసరావు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ అసోసియేషన్ లిమిటెడ్ (హాకా) చైర్మన్‌గా మహబూబాబాద్ జిల్లా మరిపెడకు చెందిన మచ్చ శ్రీనివాసరావును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈమేరకు వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి ఎం.రఘునందన్‌రావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి ఏర్పాట్లు చేపట్టాలని హాకా మేనేజింగ్ డైరెక్టర్‌ను ఆదేశించారు. -
ఓటర్ల నమోదుకు కృషిచేయాలి
భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: జిల్లా వ్యాప్తంగా ఓటర్ల నమోదులో కార్యకర్తలు క్రియాశీలకంగా వ్యవహరించాలని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. శుక్రవారం భద్రాచలం పట్టణంలో జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో నూతన ఓటర్ల నమోదు, తొలగింపు ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతుందని, కార్యకర్తలు దీనిని గుర్తించి 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరిని ఓటు నమోదు చేసుకునేలా చైతన్య పర్చాలని అన్నారు. కార్యకర్తలు గడపగడపకు వెళ్లి ఓటర్ లిస్టు పరిశీలించి నమోదు, తొలగింపు వివరాలు అధికారులకు తెలియజేయాలని అన్నారు. అందులో భాగంగా ఓటర్ల లిస్టును జిల్లా కమిటీ అన్ని మండల కమిటీలకు పంపించిందన్నారు. 12వ తేదీలోగా పోలింగ్ బూత్ కమిటీలు సిద్ధం... ఈ నెల 12వ తేదీలోగా జిల్లాలో గ్రామ, పోలింగ్ బూత్ కమిటీలను నియమించాలని రాష్ట్ర కమిటీ ఆదేశించిందని, అందులో భాగంగా మండల పార్టీ, అనుబంధ సంఘాల కమిటీలను ముందుగా ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కమిటీలను పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తల సహకారంతో మండల కన్వీనర్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులను సమన్వయ పర్చుకుంటూ నియమించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు పని చేయాలని అన్నారు. రైతులను ఆదుకోవడంలో విఫలం... భద్రాచలం, అశ్వారావుపేట, కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడ్ మండలాల్లో గోదావరి వరదల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అశ్వారావుపేట నియోజకవర్గ సమన్వయకర్త తాటి వెంకటేశ్వర్లు విమర్శించారు. ఈ ఏడాది పలుమార్లు గోదావరికి వరదలు వచ్చి రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. అయినా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ అధికారులు పంట నష్టం వేయలేదని అన్నారు. ఈ సమావేశంలో భద్రాచలం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తెల్లం వెంకట్రావ్, బీసీ సెల్ రాష్ట్ర కమిటీ సభ్యుడు కడియం రామాచారి, సీనియర్ నాయకులు తాండ్ర వెంకటరమణ, ఘంటా కృష్ణ, మంత్రిప్రగడ నర్సింహారావు, కొర్సా చినబాబు దొర, హర్షవర్ధన్‌లు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ బలోపేతానికి యువతే కీలకం
కొత్తగూడెం అర్బన్, న్యూస్‌లైన్: వైఎస్సార్ సీపీ మరింత బలోపేతం కావడానికి యువత కీలకపాత్ర పోషించాలని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు అన్నారు. పట్టణంలోని కూలీలైన్‌లో ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో పలువురు యువకులు మచ్చా శ్రీనివాసరావు సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాభివృద్ధికి యువతే కీలకమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలన్నారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలోని సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుందన్నారు. తెలంగాణ అంశంపై స్పష్టమైన వైఖరి వెల్లడించింది వైఎస్సార్సీసీ ఒక్కటేనన్నారు. కాంగ్రెస్, టీడీపీలకు చిత్తశుద్ధి లేదన్నారు. తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం రోజుకో మాట మారుస్తోందని విమర్శించారు. ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ పాకులాడుతోందన్నారు. కాంగ్రెస్ పాలనలో నిత్యావసర ధరలు పెరిగి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లాలో కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి నాయకులెవరూ లేరని వ్యాఖ్యానించారు. జిల్లాలో కాంగ్రెస్ గెలిచే అవకాశమే లేదన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు కొదమసింహం పాండురంగాచార్యులు, తాండ్ర నాగబాబు, రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు జక్కం సీతయ్య, లీగల్ సెల్ రాష్ట్ర కమిటీ సభ్యులు సాదిక్ పాషా, మందపల్లి ఉమ, నాగుల శేఖర్‌బాబు, మారం శ్రీనివాసరెడ్డి, భువన సుందర్ రెడ్డి, కొంగర అప్పారావు, గుంపుల కొమరయ్య, ఎం.డి.షఫి, నర్సింహరెడ్డి, చార్లేస్, గుంపుల దీలిప్, జయరామ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారిలో జడల ప్రకాశ్, అనంతలక్ష్మి, జడల గౌతం, ఎస్.గౌతంతోపాటు మరో 35 మంది యువకులు ఉన్నారు