కొత్తగూడెం అర్బన్, న్యూస్‌లైన్:
వైఎస్సార్ సీపీ మరింత బలోపేతం కావడానికి యువత కీలకపాత్ర పోషించాలని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు అన్నారు. పట్టణంలోని కూలీలైన్‌లో ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో పలువురు యువకులు మచ్చా శ్రీనివాసరావు సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాభివృద్ధికి యువతే కీలకమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలన్నారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలోని సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుందన్నారు. తెలంగాణ అంశంపై స్పష్టమైన వైఖరి వెల్లడించింది వైఎస్సార్‌సీసీ ఒక్కటేనన్నారు. కాంగ్రెస్, టీడీపీలకు చిత్తశుద్ధి లేదన్నారు.
తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం రోజుకో మాట మారుస్తోందని విమర్శించారు. ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ పాకులాడుతోందన్నారు. కాంగ్రెస్ పాలనలో నిత్యావసర ధరలు పెరిగి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లాలో కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి నాయకులెవరూ లేరని వ్యాఖ్యానించారు. జిల్లాలో కాంగ్రెస్ గెలిచే అవకాశమే లేదన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు కొదమసింహం పాండురంగాచార్యులు, తాండ్ర నాగబాబు, రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు జక్కం సీతయ్య, లీగల్ సెల్ రాష్ట్ర కమిటీ సభ్యులు సాదిక్ పాషా, మందపల్లి ఉమ, నాగుల శేఖర్‌బాబు, మారం శ్రీనివాసరెడ్డి, భువన సుందర్ రెడ్డి, కొంగర అప్పారావు, గుంపుల కొమరయ్య, ఎం.డి.షఫి, నర్సింహరెడ్డి, చార్లేస్, గుంపుల దీలిప్, జయరామ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారిలో జడల ప్రకాశ్, అనంతలక్ష్మి, జడల గౌతం, ఎస్.గౌతంతోపాటు మరో 35 మంది యువకులు ఉన్నారు
వైఎస్సార్‌సీపీ బలోపేతానికి యువతే కీలకం
Published Mon, Dec 2 2013 2:16 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement
Advertisement